మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సుష్మిత కొణిదెల, సాహూ గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. అయితే నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా `మెగా 157` వర్కింగ్ టైటిల్ గ్లింప్స్‌ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.
సినిమాకు `మన శంకర వరప్రసాద్ గారు` అనే క్రేజీ టైటిల్‌ను లాక్ చేశారు. `పండక్కి వస్తున్నారు..` అనేది ఉపశీర్షిక. ఇక గింప్స్ లో ఫుల్ సెక్యూరిటీ నడుమ సూటు బూటు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని కారు దిగుతూ సిగరెట్ వెలిగించి మెగాస్టార్ సూపర్ స్టైలిష్ గా నడిచి రావడం నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవచ్చు. వింటేజ్ చిరంజీవిని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు.
అలాగే `మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు` అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లింప్స్ చివర్లో గన్ పట్టుకొని చిరంజీవి స్టెప్స్ దిగే షాట్ మరియు గుర్రాన్ని పట్టుకొని నడిచే షాట్ అదిరిపోయాయి. మొత్తానికి ఈ టైటిల్ గ్లింప్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి బర్త్‌డేకి అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా, మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది.