దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వినాయక చవితి అంటే మనకు ముందుకు గుర్తొచ్చేది గణపతి విగ్రహాల అద్భుత శిల్పకళ. ప్రతి ఏడాది విగ్రహాల్లో కొత్త డిజైన్లు, కొత్త థీమ్స్ కనిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా భక్తులు వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశుడి విగ్రహం అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటోంది.
భారతీయ ఆధ్యాత్మిక సంపదలో అపూర్వమైన స్థానం సంపాదించుకున్న పవిత్ర గ్రంథం భగవద్గీత పుస్తకాలతో బొజ్జ గణపయ్యను రూపొందించారు. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో ఈ అరుదైన వినాయకుడు కొలువుదీరాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం ఏకంగా 5 వేల భగవద్గీత పుస్తకాలను వినియోగించారు.
అలాగే 1500 `వేల్ విరుతం` మరియు 1008 `మురుగన్ కవాసం` పుస్తకాలతో సహా మొత్తం 7500 పవిత్ర గ్రంథాలతో గణపతి విగ్రహాన్ని రూపొందించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు, సందర్శకులకు రెండు కళ్లు చాలడం లేదు. భక్తి మాత్రమే కాదు విగ్రహం రూపకల్పనలోని సృజనాత్మకత కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం పెంచే విధంగా బొజ్జ గణపయ్య ఉన్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu | A Ganesh Idol in the Mannali area is made using 7500 books, including 5000 Bhagavad Gita, 1500 Vel Virutham and 1008 Murugan Kavasam books#GaneshChaturthi pic.twitter.com/xxRSQAveAi
— ANI (@ANI) August 27, 2025 ">
#WATCH | Chennai, Tamil Nadu | A Ganesh Idol in the Mannali area is made using 7500 books, including 5000 Bhagavad Gita, 1500 Vel Virutham and 1008 Murugan Kavasam books#GaneshChaturthi pic.twitter.com/xxRSQAveAi
— ANI (@ANI) August 27, 2025