టాలీవుడ్ లో మరోసారి వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయి. ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లికి సిద్ధమైంది. తాజాగా తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగినట్లు నివేదా పరోక్షంగా వెల్లడించింది. ఈ బ్యూటీకి కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. వినాయక చవితి సందర్భంగా బుధవారం ప్రియుడితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా నివేదా పంచుకుంది. `ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..` అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ను జోడించడంతో.. అభిమానులు, నెటిజన్లు, పరిశ్రమలోని శ్రేయోభిలాషులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదే తరుణంలో నివేదాకు కాబోయే భర్త గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రాజ్‌హిత్ ఇబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మైండ్‌బ్లాక్. ఇతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. కానీ దుబాయ్‌లో బడా వ్యాపారవేత్త. తమిళ్ ముస్లిం కుటుంబానికి చెందిన వాడు. బిజినెస్ పనుల నిమిత్తం న్యూయార్క్, హాంకాంగ్, పారిస్ అంటూ దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి.
ఇక ఓ ఫ్యాషన్ షోలో రాజ్‌హిత్, నివేదా కలుసుకున్నారని.. ఆ పరిచయమే ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని అంటున్నారు. రీసెంట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఈ ఏడాది చివర్లో ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని రాజ్‌హిత్, నివేదా జంట భావిస్తున్నట్లు సమాచారం. వెడ్డింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.