ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క అమరావతి రాజధాని నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పెట్టుబడులు ఆకర్షించే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం కుప్పం డెవలప్ మెంట్ పై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అగ్రశ్రేణి అల్యూమినియం తయారీ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది.
ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలను యాపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించబోతున్నారు. యాపిపిల్ గ్లోబల్ చైన్ తో రాష్ట్రాన్ని ఈ యూనిట్ అనుసంధానిస్తుంది. ఇది ఏపీకే కాకుండా దేశానికి కూడా ప్రతిష్మాత్మకం కానుంది. ఈ కొత్త అల్యూమినియం ఫెసిలిటీ మార్చి 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా నాలుగేళ్లలో సుమారు 613 ఉద్యోగాలు ఏపీకి రాబోతున్నాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఈ యూనిట్ ఆమోదం పొందనుంది. దీంతో, హిండాల్కో సంస్థకు సబ్సిడీ భూమి, ఇతర ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయి.