ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కబోతోందని.. ఇటీవల దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త, తన చిరకాలం ప్రియుడు రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు ఆవాస్తవమని తాజాగా నివేత బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో ఉన్నది నిజమే.. కానీ తమ నిశ్చితార్థం ఇంకా జరగలేదని నివేదా లేటెస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ, ఎంగేజ్మెంట్, పెళ్లికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా రాజ్‌హిత్, నివేదా ప్రేమలో ఉన్నారు. నివేదాకు యాక్టింగ్‌తో పాటు స్పోర్ట్‌పై కూడా ఆసక్తి ఎక్కువ. ఈ బ్యూటీకి రేసింగ్, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. అయితే దుబాయ్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఫార్ములా ఈ రేసింగ్‌లో తొలిసారి నివేదా రాజ్‌హిత్‌ను కలుసుకుంది. అలా ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారిందని నివేదా పేర్కొంది. మన బంధాన్ని పెళ్లి వరకూ ఎందుకు తీసుకెళ్లకూడదు? అని ఒకరినొకరం ప్రశ్నించుకుని పెళ్లికి రెడీ అయ్యామని.. మా లవ్ సంగతి నాకు బాగా కావాల్సిన వారికి మాత్రమే తెలుసని.. ఇండస్ట్రీలో ఎవరికీ చెప్పలేదని నివేదా తెలిపింది.
అందుకే రాజ్‌హిత్ ను పరిచయం చేయగానే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని.. వారిలో మా మేనేజర్ ఒకరని నివేదా చెప్పుకొచ్చింది. వచ్చే అక్టోబర్‌లో నిశ్చితార్థం, 2026 జనవరిలో వివాహాన్ని ప్లాన్ చేసుకున్నామని.. ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదని నివేదా పేతురాజ్ స్పష్టం చేసింది. ఇక ఈ వేడుకలు కేవలం కుటుంబ సభ్యుల నడుమ నిరాడంబరంగా జరగనున్నాయని కూడా పేర్కొంది.