పుబ్బలో పుట్టి అమావాస్యలో కలసిపోయే పార్టీల గురించి కూడా మాట్లాడతారా?`- ఇదీ.. ఒకప్పుడు.. కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శ. అంతేకాదు.. సినీమా నటులు కూడా రాజకీయాలు చేస్తారా? అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటి స్థాయి నుంచి నేడు టీడీపీ అంటే.. సుమారు 18 దేశాలకు విస్తరించింది. దుబాయ్ నుంచి అమెరికా వరకు.. యూరప్ నుంచి దక్షిణాఫ్రికా దాకా.. తెలుగు సౌరభాలు గుభాళించేలా చేసిన నాయకుడు ప్రస్తుతం పార్ట అధినేత.. సీఎం చంద్రబాబు.
నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ మహా అయితే.. జాతీయ పార్టీ స్థాయికి ఎదుగుతుంది. కానీ, అంతర్జాతీయ స్థాయికి తెలుగు జెండానే కాదు.. తెలుగు వెలుగులు కూడా తీసుకువెళ్లిన నాయకుడు చంద్రబాబు. నేడు 18 దేశాల్లో తెలుగు వారిని ఏకం చేస్తున్న.. వారి సమస్యలపై స్పందిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ, 2000 సంవత్సరం వరకు అమెరికా, కెనడా.. వరకే పరిమితమైన పార్టీని తర్వాత.. కాలంలో ప్రపంచంలోని 18 దేశాలకు పరిచయం చేశారు. రాష్ట్రంలో పుంజుకుంటూనే.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని నడిపించే స్థాయికి వచ్చారు.
ఎన్నార్టీ తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా), దుబాయ్ తెలుగు సంఘం ఇలా.. చెప్పుకొంటూ పోతే.. అనేక సంఘాల ఆవిర్భావం.. తెలుగు వారికి అందిస్తున్న సేవల వెనుక అక్షరాల ఉన్నది చంద్రబాబు అనే నిలువెత్తు విగ్రహం. రాజకీయ నిగ్రహం!. `తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. బాగుండాలి` అనే చంద్రబాబు నినాదం.. జగద్వితం. ఆయన ఆలోచనలు.. పనులు కూడా.. తెలుగు వారిచుట్టూనే తిరుగుతాయి. పార్టీలకు.. పంతాలకు అతీతంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. పుంజుకోవాలని ఆశించిన నాయకుడు కూడా చంద్రబాబే.
నేడు అనేక మంది తెలుగు యువత అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా.. ఉద్యోగాలు సంపాయించుకుని .. ఆర్థికంగా నిలదొక్కుకున్నా.. అది సంపూర్ణంగా చంద్రబాబు ఘనతే. `మేం మీకు మ్యాన్ పవర్ అందిం చాం` అని తలెత్తుకుని ప్రపంచ దేశాల ముందు చెప్పేస్థాయికి తీసుకువచ్చిన నాయకుడు కూడా చంద్రబాబే. అందరూ అన్నీ చేయలేరు.. అనే మాటను బుట్టదాఖలు చేసి.. తలుచుకుంటే.. సంకల్పం ఉంటే.. ఏదైనా సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి కూడా.. చంద్రబాబే. అందుకే.. ఆయన నాడు-నేడు.. మాత్రమే కాదు.. ఏనాడూ.. తెలుగు వారి గర్వకారణం.