స్పిరిట్.. సూపర్ స్పీడ్ మోడ్‌

admin
Published by Admin — October 19, 2025 in Movies
News Image
ప్రభాస్ కొత్త చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాటిలో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ.. ఈ చిత్రాన్ని రూపొందించనుండడంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా ఈపాటికే సెట్స్ మీదికి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో కొంచెం ఆలస్యం అవుతోంది.
 
సెప్టెంబరు నెలాఖర్లోనే చిత్రీకరణ మొదలవుతుందని సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ.. కుదర్లేదు. ఐతే తాజాగా సందీప్ ‘స్పిరిట్’ షూట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. నవంబరు రెండో వారంలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. ఒక్కసారి ప్రభాస్ వచ్చాడంటే నాన్ స్టాప్‌గా షూట్ చేయడానికే చూస్తున్నాడు సందీప్. ఇందుకోసం పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
మామూలుగా ప్రభాస్ సినిమాలంటే మేకింగ్ కోసం సంవత్సరం అయినా పడుతుంటుంది. మిడ్ రేంజ్ మూవీ అనుకున్న ‘రాజా సాబ్’కు కూడా రెండేళ్లకు పైగానే టైం తీసుకుంటున్నారు. ఐతే ‘స్పిరిట్’ మాత్రం ఆ కోవలో చేరబోదట. సందీప్‌కు చాలా వేగంగా సినిమాలు తీస్తాడని పేరుంది. ‘యానిమల్’ లాంటి భారీ కాస్టింగ్ ఉన్న, దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న సినిమాను కూడా వంద రోజుల వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ చేశాడు. దాని ఒరిజినల్ రన్ టైం 4 గంటల పైగానే కావడం గమనార్హం. ‘స్పిరిట్’ కూడా నిడివి పరంగా పెద్దగానే ఉంటుందట. ఐతే ప్రి ప్రొడక్షన్ చాలా పక్కాగా చేసుకుంటాడు సందీప్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేయించుకుని, అది దగ్గర పెట్టుకుని శరవేగంగా సన్నివేశాలు పూర్తి చేస్తాడు.
 
ఇంతకుముందు సినిమా గురించి మాట్లాడినపుడే 80 శాతం ఆర్ఆర్ వర్క్ పూర్తయిందన్నాడు. షూట్ మొదలయ్యేటప్పటికి స్కోర్ మొత్తం రెడీగా ఉంటుంది. ప్రతి సన్నివేశం లెంగ్త్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. ప్రభాస్ 60-70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడంటే చాలు.. మొత్తంగా వంద రోజుల్లో సినిమాను పూర్తి చేసేయడం గ్యారెంటీ. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివరికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. 2025కు ఆల్రెడీ రాజా సాబ్, ఫౌజీ షెడ్యూల్ అయ్యాయి. మరి మూడో సినిమా కూడా వచ్చే ఏడాదే వచ్చేస్తుందేమో చూద్దాం.
Tags
spirit movie prabhas jet speed shooting
Recent Comments
Leave a Comment

Related News