దక్షిణాదిన ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా రాజ్యమేలింది రమ్యకృష్ణ. అందం, అభినయం, అటిట్యూడ్.. అన్నీ కలగలసిన ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మొత్తం 300కు పైగా సినిమాల్లో మెరుపులు మెరిపించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో రూల్ చేసింది. ప్రస్తుతం హీరోలకు తల్లిగా, అత్తగా కనిపిస్తున్నా.. స్టైల్, ఆకర్షణ మాత్రం యంగ్ హీరోయిన్ల రేంజ్‌లోనే ఉందంటే తప్పు లేదు. ఇక ఆ రోజుల్లో ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కుర్రకారంతా ఫిదా అయిపోయేవారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు… కొంతమంది స్టార్ హీరోలు కూడా రమ్యకృష్ణ అందం, స్టైల్‌కి సైట్ కొట్టారట. ఈ విషయాన్ని రమ్యకృష్ణ స్వయంగా అంగీకరించింది.
తాజాగా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో రమ్యకృష్ణ గెస్ట్‌గా హాజరైంది. షో మొదలైన దగ్గరనుంచి జగ్గుభాయ్ పూర్తిగా ఫుల్ ఫార్మ్‌లోకి వెళ్లిపోయారు. రమ్యకృష్ణ తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ షోలో పంచుకున్నారు. ఇదే క్రమంలో జగ్గుభాయ్ ఓ సూటి ప్రశ్న వేశారు. ``నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం చేశారు కదా?`` అని జగపతిబాబు అడుగుతుండంగానే.. రమ్యకృష్ణ ఒక్క సెకనుకూడా ఆగకుండా ``ఇన్‌క్లూడింగ్ యూ (నువ్వు కూడా!)`` అని ముఖం మీదే చెప్పేసింది. ఆ సమాధానం విన్న వెంటనే సెట్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది.
ఇక జగ్గుభాయ్‌కి మాట రాలేదు… కేవలం ఒక స్మైలింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో సీన్‌ను సర్దేశారు. ఈ ఫన్నీ మూమెంట్‌తో ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, రమ్యకృష్ణ పేరు చెప్పగానే ఈ రోజుకీ హీరోలు, దర్శకులు చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ ఆ కాలంలో ఆమెతో పనిచేసిన హీరోల్లో చాలామంది మనసులో సీక్రెట్ క్రష్ పెట్టుకున్నారట. నాగార్జున, వెంకటేష్, అర్జున్, రాజశేఖర్, కమల్ హాసన్, మమ్ముట్టి, రజనీకాంత్.. లిస్ట్ పెద్దదే ఉందని ఇండస్ట్రీ టాక్.