మ‌రోసారి తండ్రి కాబోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న సీమంతం వీడియో వైర‌ల్!

admin
Published by Admin — October 23, 2025 in Movies
News Image

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మరో సంతోషకరమైన వార్త వెల్లువెత్తింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌ను స్వయంగా ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీ ఈసారి దీపావళిని ప్రత్యేకంగా జరుపుకుంది. 

అయితే చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను సైతం నిర్వహించారు. అంగరంగ వైభవంగా జ‌రిగిన ఈ శుభ‌కార్యంలో కుటుంబ సభ్యుల‌తో పాటు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు కూడా పాల్గొని ఉపాస‌న‌ను ఆశీర్వ‌దించారు. `ఈ దీపావళికి మా ఇంటి వెలుగులు, ప్రేమానురాగాలు, ఆశీర్వచనాలు రెట్టింపయ్యాయి` అనే నోట్‌తో సీమంతం వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా ఉపాసన షేర్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

కాగా, 2012లో రామ్ చరణ్‌, ఉసాసన వివాహం చేసుకున్నారు. 2023 జూన్‌లో ఉపాసన త‌న మొద‌టి బిడ్డ‌ క్లిన్ కారాకు జన్మించింది. ఇక‌ రెండేళ్లలోనే మళ్లీ గుడ్ న్యూస్ రావడంతో మెగా అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. “క్లిన్ కారాకు త‌మ్ముడు వస్తున్నాడు”, “సింబా ఎంట్రీకి రెడీ” అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

 

This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏
pic.twitter.com/YuSYmL82dd

— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025 ">

 

Tags
Ram Charan Upasana Tollywood Mega Family upasana second pregnancy
Recent Comments
Leave a Comment

Related News