బస్సు దగ్ధం...షాకింగ్ విషయాలు వెల్లడి!

admin
Published by Admin — October 24, 2025 in Andhra
News Image

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైకు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. 21 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, అతి వేగం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. దాదాపు 24 వేల రూపాయల ఫైన్ ఆ బస్సుపై ఉంది. గత రెండేళ్లలో ఆ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించింది. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలో కూడా ఆ బస్సుకు రవాణా శాఖ, ట్రాఫిక్ అధికారులు జరిమానా విధించారు.

Tags
shocking facts bus burned fire accident Kurnool 16 pending challans
Recent Comments
Leave a Comment

Related News