ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌ల సరసన వెలుగొందిన నటుడు సుమన్. అందం, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, క్లాస్ లుక్‌తో 80లలోనే ప్రేక్షకుల గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్ర చేసినా తనదైన ముద్ర వేసిన సుమన్.. కేవలం తెలుగు సినిమాలే కాదు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్‌లో నెగటివ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అయితే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సుమన్.. తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలను రివీల్ చేశారకు కేరీర్ పిక్స్ లో ఉన్న టైమ్‌లో తనకు చేతబడి చేశారని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``నాపై చేతబడి జరిగింది అన్నది నిజం. కానీ ఎవరు చేయించారో నాకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బిజినెస్ ప్రపంచంలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి`` అని ఆయన స్పష్టంగా చెప్పారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమైందని, ఆ దశలో తానూ మానసికంగా చాలా కుంగిపోయానని సుమన్ తెలిపారు.
ఆ సమయంలో కొంతమంది స్నేహితులు, పరిచయస్తులు ఇచ్చిన సలహా మేరకు కేరళలోని ‘చోటనికరే’ అనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లి చేతబడికి విరుగుడు పూజలు చేయించుకున్నానని సుమన్ చెప్పుకొచ్చారు. అక్కడ చేసిన పూజలు ఫలించాయా లేదా అన్నది చెప్పలేనని, కానీ తన నమ్మకం మాత్రం టైమ్, కర్మ మీదే అని ఆయన అన్నారు. ఎప్పుడు, ఏది జరగాలో ఆ టైమ్ జరిపిస్తుంది. అదే కర్మ. రోగాలు, ఎదురుదెబ్బలు, విజయాలు అన్నీ మన కర్మ ప్రకారమే జరుగుతాయి. వాటిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తనను ఈ దశకు తీసుకువచ్చింది కూడా టైమ్‌మే అంటూ సుమన్ తాత్వికంగా స్పందించారు. ప్రస్తుతం సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.