బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో ప్రచార పర్వం మరింత రాజుకుం ది. అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండీ కూటముల మధ్య వార్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమం లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది సహజమే కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం కాస్తా అదుపు తప్పింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహా ఘట్ బంధన్‌ను ఉద్దేశించి ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అది మహాఘట్ బంధన్ కాదు.. మహా లఠ్ బందన్(మహా నేరస్థుల కూటమి) అని ప్రధాని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై ఇండీ కూటమి నాయకులు మండిపడ్డారు. ముఖ్యంగా ఆర్జేడీ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన నేరస్తులు.. దొంగలు ఉన్నది ఎన్డీయేలోనేన ని.. డబుల్ ఇంజన్‌లో ఒక ఇంజన్ అవినీతి పరులదని, మరోఇంజన్ నేరస్తులదని ఆయన తిప్పికొట్టారు. తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. ఇది నేరస్తులు నడుపుతు న్న ఇంజన్ ప్రభుత్వమని అన్నారు.
ఇక, ప్రధాని అన్న మరో మాటకు కూడా తేజస్వి బదులిచ్చారు. ఆర్జేడీ పార్టీ గత పాలనను ప్రధాని దుయ్య బట్టారు. జంగిల్ రాజ్(ఆటవిక పాలన)ను తిరిగి తెచ్చుకునేందుకు బీహార్ ప్రజలు సుముఖంగా లేరని తెలిపారు. అంతేకాదు.. గత పాలన అంతా దొంగలదేనన్నారు. ఈ వ్యాఖ్యలపైనా తేజస్వి మండిపడ్డారు. అసలైన దొంగల ప్రభుత్వం మీదేనని.. 55 కుంభకోణాలు జరిగినా.. నితీష్‌కుమార్‌ను ప్రధాని వెనుకేసుకు వస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని.. అలాంటి దొంగలు.. మాపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇక, తమ కూటమి సర్కారు వస్తే.. సుపరిపాలన అందిస్తామన్నారు. అవినీతి రహితంగా ప్రజలకు పాలన చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని కూడా.. తేజస్వి చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీజేపీ నాయకులు.. గత లాలూ ప్రభుత్వాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. పారదర్శక పాలనకు.. విధ్వంసకర పాలనకు తేడా చూడాలంటూ.. ప్రజలకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అనేక పోస్టులు కూడా పంపుతున్నా రు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కూడా బీజేపీ సహా జేడీయూ నేతలపై విమర్శలు చేస్తూ.. పోస్టులు పెడుతోంది. మొత్తంగా నువ్వా-నేనా అన్నట్టే బీహార్ ఎన్నికల ప్రచారం సాగుతోంది.