తన సొంత స్టైల్, నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శర్వానంద్. కెరీర్‌లో ప్రతి సారి కొత్తదనం కోసం ప్రయత్నించే ఆయన.. ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతారంలో దర్శనమిచ్చాడు. శర్వానంద్ త్వరలో ‘బైకర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి దర్శకుడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇది 1990–2000ల కాలం నేపథ్యంలో సాగే రేసింగ్, కలలు, కుటుంబ భావోద్వేగాలను మేళవించిన కథ. దీపావళి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో స్పోర్ట్స్ బైక్‌పై రేస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న రేసర్‌గా శర్వా కొత్త లుక్‌తో మెరిశారు. అయితే సోషల్ మీడియాలో ఆయన తాజాగా షేర్ చేసిన షర్ట్‌లెస్ ఫొటోలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసిన శర్వాను చూసి అభిమానులు షాకైపోతున్నారు. కొందరైతే శర్వాను గుర్తు కూడా పట్టలేకపోతున్నారు.

బ్రేకర్ మూవీలో నిజమైన రేసర్‌లా కనిపించేందుకు శర్వా భారీగా బరువు తగ్గాడు. సన్నగా, ఫిట్‌గా మారిపోయాడు. నెలల తరబడి కఠినమైన వర్కౌట్స్, క్రమశిక్షణతో కూడిన డైట్ పాటిస్తూ లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని సొంతం చేసుకున్నాడు. ఇక షార్ట్ లెస్‌గా శర్వాను చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు. `ఏందయ్యా ఈ లుక్కు.. అసలు ఇది నిజంగానే శర్వానందేనా?` అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. మొత్తానికి, ‘బైకర్’ కోసం శర్వానంద్ చేసిన ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూస్తే ఆయన ఎంత ప్యాషన్‌తో ఈ పాత్రలో దూకాడో అర్థమవుతోంది. ఈ కొత్త లుక్, కొత్త ఎనర్జీతో శర్వా మరోసారి తన కెరీర్‌లో కొత్త హైట్స్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.