హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక హెచ్ సీయూ యూనివర్సిటీకి సంబంధించిన వందలాది ఎకరాల్లో చెట్లు నరుకుతున్న అంశంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. వన్యప్రాణులకు, పర్యావరణానికి నష్టం కలిగించేలా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందని, చెట్ల నరికివేత వెంటనే ఆపాలని హెచ్ సీయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థులకు పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు.