టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లిన విషయం తెలిసిం దే. శనివారం మధ్యాహ్నం ఆయన బీహార్ రాజధాని పట్నాకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కీలక నాయకులు , ఏపీకి చెందిన నరసింహారావు సహా మరికొందరు విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఆ వెంటనే నారా లోకేష్ తనకు కేటాయించిన హోటల్ కు చేరుకున్నారు. అనంతరం.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సీఐఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం వివరించారు.
దీనికి ముందు విమానాశ్రయంలో నేషనల్ మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం డెవలప్ అవుతుందని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వసహకారంతోనే విశాఖకు గూగుల్ డేటా కేంద్రం వచ్చిందని తెలిపారు. అమరావతి రాజధానికి కూడా కేంద్రం నుంచి సహకారం ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను విరివిగా విని యోగించుకుంటున్నామన్నారు. బీజేపీ నేతృత్వంలోనిడబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధిలో దూసుకుపోతున్నట్టు చెప్పారు. బీహార్‌లోనూ డబుల్ ఇంజన్ సర్కారు కొనసాగాల్సిన అవసరం ఉందని నారా లోకేష్‌తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తానన్నారు.
అనంతరం ఆయన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, ప్రాజెక్టులు వంటివాటిని వివరించారు. మొత్తంగా పాట్నా చేరుకున్న వెంటనే ఆయన పని ప్రారంభించారు. నారా లోకేష్ వెంట టీడీపీ ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పల నాయుడు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కూడా నారా లోకేష్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం పాట్నాలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. దీనికి ముందు.. బీజేపీ, జేడీయూ నాయకులతో కలిసి.. రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది.
కాగా.. ఆదివారం సాయంత్రంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ పోలింగ్ ఈ నెల 6న పూర్తికాగా 65.08 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.