దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఓ కారు బాంబు పేలిన దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ పార్కింగ్ లో ఒక కారులో పెట్టిన బాంబును రిమోట్ కంట్రోల్ సాయంతో ఉగ్రవాదులు ఆపరేట్ చేసి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం సెలవు కావడంతో పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు మూసి ఉన్నాయి కాబట్టి ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు, పోలీసులు, ప్రత్యేక బలగాలు చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.