నేషనల్ క్రష్ రష్మిక మందన్న మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్”. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. నవంబర్ 7న విడుదలైన ది గర్ల్‌ఫ్రెండ్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రష్మిక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే స్క్రీన్‌పై రష్మిక ఎంద డామినేటింగ్‌గా ఉన్నప్పటికీ.. దీక్షిత్ శెట్టి కూడా తన నటనతో చెలరేగిపోయాడు.
విక్రమ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. దసరా చిత్రంతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో, ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరో పాత్రకు ఫస్ట్ ఛాయిస్ దీక్షిత్ శెట్టి కాదట. మొదట డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మొదటగా నాగశౌర్యను విక్రమ్ పాత్ర కోసం అనుకున్నారట. కథను కూడా నాగశౌర్యకు వినిపించారట.
స్టోరీ నచ్చినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాక నాగశౌర్య సున్నితంగా ది గర్ల్‌ఫ్రెండ్ ను రిజెక్ట్ చేశాడట. దాంతో ఆ ఛాన్స్ దీక్షిత్ శెట్టిని వరించింది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. నాగశౌర్య విక్రమ్ పాత్రను చేసి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేదని అంటున్నారు. కానీ, దీక్షిత్ తన సొంత శైలిలో పాత్రను జీవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.