చిక్కుల్లో మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని..!

admin
Published by Admin — March 04, 2025 in Politics
News Image

వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు అవినీతికి పాల్పడిన నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జైలు పాలవగా.. తాజాగా మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడ‌ద‌ల ర‌జిని చిక్కుల్లో పడ్డారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులపై బెదిరింపుల‌కు పాల్ప‌డి వారి నుంచి రూ. 2.20 కోట్లు అక్ర‌మంగా వ‌సూల్ చేశార‌న్న అభియోగాలతో విడ‌ద‌ల ర‌జిని, ఐసీఎస్ అధికారి ప‌ల్లె జాషువాపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రెడీ అయింది.

ఇప్ప‌టికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విడ‌ద‌ల ర‌జిని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించింది. శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్‌ ఓనర్ లను విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు బెదిరించార‌ని.. రూ.5కోట్లు డిమాండ్ చేసి, చివ‌ర‌కు రూ.2.20 కోట్లు వసూలు చేశారని నివేదిక‌లో పేర్కొంది. ఆ 

Recent Comments
Leave a Comment

Related News