తప్పు చేయడం తప్పే అయినా.. పశ్చాత్తాపం చెందడం ద్వారా.. ఒకింత మానసికంగా అయినా.. ఉపశ మ నం పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకేనేమో.. పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదని అంటా రు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణి కేసులో నిందితుడు రవికుమార్.. ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన పనిని ఆయన సమర్థించుకోలేదు. చిన్నది చేసి కూడా చూపించలేదు. తాను మహాపాపం చేశానని ఒప్పుకొన్నారు.
తాను క్షమించరానితప్పు చేశానని కూడా రవి కుమార్ చెప్పాడు. అందుకే.. పశ్చాత్తాపం కింద తన యావ దాస్తిలో 90 శాతం శ్రీవారికి రాసిచ్చేశానని కూడా సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. సహజం భారత నేర శిక్షాస్మృతిలో తప్పు ఒప్పుకొంటే శిక్ష తగ్గుతుంది. సో.. దీనికి రవికుమార్ అర్హుడే కావొచ్చు. ఏదేమైనా..దీనిని హైకోర్టు తేల్చనుంది. అయితే.. శ్రీవారిసొమ్ము అపహరణలో నిందితుడైన రవికుమార్ తాను చేసింది మహా పాపమని ఒప్పుకొన్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత విమర్శలకు దారితీస్తున్నాయి.
పరకామణి కేసు చిన్నదిగా జగన్ అభివర్ణించడంతోపాటు.. 70 వేల సొమ్ముకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేశా రని.. ఇంక కేసు ఎందుకని కూడా వ్యాఖ్యానించారు. కానీ.. అసలు నిందితుడు మాత్రం తాను మహాపాపం చేశానని ఒప్పుకొన్నారు. అంటే.. ఆయనలో కొంత మేరకైనా పశ్చాత్తాపం కనిపిస్తుండగా.. జగన్‌లో అతి కూడా కనిపించడం లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పు చేసినా.. దానిని ఒప్పుకొని పశ్చాత్తాపడ డంలో ఒకింత నిజాయితీ అయినా ఉందని చెబుతున్నారు. కానీ, దొంగలను వెనుకేసుకు వచ్చి.. జగన్ సమర్థించేలా వ్యాఖ్యానించడాన్ని కనీసం.. శ్రీవారి విషయంలో భీతి కూడా లేకుండాప్రవర్తించడాన్ని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.