రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థులు శత్రువులుగా మారుతారు లేదా వైరి పక్షంగా ఉంటారు. తద్వారా రాజకీయంగా అవాంతరాలు ఎదురవుతాయి. అవమానాలు ఎదురవుతాయి. ఇది రాజకీయాల్లో అందరికీ అనుభవమైనటువంటి ప్రక్రియ. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కు ప్రత్యేకంగా ప్రత్యర్థులు అనేవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇటు టిడిపి నుంచి కానీ అటు వైసీపీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీని తమకు ప్రధాన పోటీ పార్టీ అని గాని తమకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అని గానీ ఎవరు భావించటం లేదు.
స్థానికంగా ఓటు బ్యాంకు లేకపోవడం, విభజన తాలూకా అంశాలు ఇంకా ప్రజల్లో ఉండడం నాయకుల పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ పొలిటికల్ పార్టీగా కానీ ప్రత్యామ్నాయ ప్రత్యర్థి పార్టీగా కానీ ఎవరు భావించటం లేదు. ఇలాంటి సమయంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఆమెకు ఆమే ప్రత్యర్థిగా మారారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
తొలినాళ్లలో కాంగ్రెస్ పుంజుకునే సమయంలో అన్న జగన్‌ను టార్గెట్ చేయటం కేవలం జగన్‌ను విమర్శించడానికి, ఆస్తులను పంచుకోవడానికి రాజకీయాలకు వచ్చారని వాదన బలపడడంతోతో ఆమె ఇమేజ్ భారీగా డామేజ్ అయింది. ఆ తర్వాత కొంత పుంజుకుని ఇటీవల కాలంలో ప్రభుత్వం పై లేదా ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ అవి కూడా పెద్దగా ప్రజల్లో మైలేజీ తీసుకురావడం లేదు. సో ఇది వ్యక్తిగతంగా షర్మిల పరిస్థితిని దిగజారేలా చేసింది.
మరోవైపు పార్టీలో కూడా సీనియర్లను గతంలో ఆమె లెక్క చేయలేదన్న వాదన వినిపించింది. ముఖ్యంగా మహిళ నాయకులను తొక్కేస్తున్నారు అన్న వాదన వినిపించింది. దీని నుంచి కూడా బయటపడలేదు. సో మొత్తంగా ప్రత్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండానే షర్మిలంతట షర్మిలే పార్టీలో మైనస్ అయ్యారు.. అన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. దీని నుంచి బయటపడటం, తప్పులను సరి చేసుకోవడం అనేది ప్రస్తుతం ఆమె ముందున్న ప్రధాన కర్తవ్యం.