అమెరికాలోని ఫ్రీమాంట్ లో గివింగ్ బ్యాక్ టు ద లోకల్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) విజయవంతంగా నిర్వహించింది. డిసెంబర్ 14వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది అతిథులు హాజరయ్యారు. వారిలో 25కు పైగా అధికారులు, పలు సంఘాల నాయకులు, పలు కుటుంబాలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మద్దతిచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, ఈ ఈవెంట్ కు హాజరైనవారికి, వాలంటీర్లకు AIA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక సమాజానికి అందరూ కలిసి తిరిగి ఇవ్వడం అనే భావనతో ఏమి సాధించగలం అన్న విషయాన్ని ఈ కార్యక్రమం రుజువుచేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 3 ముఖ్యమైన స్థానిక సంస్థలకు AIA మరియు ఏఐఏ మద్దతుదారులు సహాయం అందజేశాయి
1) ఫ్రీమాంట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ – యువతకు సంబంధించిన కార్యక్రమాలు, స్థానిక విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకు మద్దతు
2) ఫ్రీమాంట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ – బొమ్మలు అవసరమైన పిల్లలకు బొమ్మలు అందజేయడం
3) ట్రై-సిటీ వాలంటీర్స్ ఫుడ్ బ్యాంక్ – ఆహారం అవసరమున్న వారికి ఉచితంగా ఆహారం సరఫరా చేయడం
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ క్రింది భాగస్వాములు ఎంతో మద్దతునిచ్చారు
1. చార్మినార్ ఇండియన్ రెస్టారెంట్ & కేటరింగ్
2. ఫార్మాటెక్ ఐఎన్ సీ
4. అథెనాటెక్ ఐఎన్ సీ (అథెనా టెక్నాలజీ సొల్యూషన్స్)
5. సిటీ సిటీస్ ఐఎన్ సీ
6. బే ఏరియా కమ్యూనిటీ హెల్త్ (BACH)
7. ICAI సాన్ ఫ్రాన్సిస్కో - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్
8. వెట్రి ల్యాబ్స్
9. సేవా దివాళీ ఫుడ్ డ్రైవ్ టీమ్
10. అలమీడా కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హాబర్ట్
11. ఫ్రీమాంట్ చాంబర్ ఆఫ్ కామర్స్
ఈ సమావేశంలో ఫ్రీమాంట్ మేయర్ డాక్టర్ రాజ్ సాల్వాన్ నాయకత్వంలోని ఫ్రీమాంట్ సిటీ కౌన్సిల్ సభ్యులంతా హాజరయ్యారు. వారితోపాటు అలమీడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఉర్సులా జోన్స్ డిక్సన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటానో మరియు ఇతర ప్రముఖ ఎన్నికైన అధికారులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు:
1) రాజ్ సాల్వాన్ - మేయర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
2) అంబిలి నాయర్ – ప్రతినిధి, ది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సాన్ ఫ్రాన్సిస్కో
3) ఉర్సులా జోన్స్ డిక్సన్ - డిస్ట్రిక్ట్ అటార్నీ, అలమీడా కౌంటీ
4) కార్మెన్ మోంటానో - మేయర్, సిటీ ఆఫ్ మిల్పిటాస్
5) యాజింగ్ జాంగ్ - వైస్ మేయర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
6) తెరెసా కెంగ్ - కౌన్సిల్‌మెంబర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
7) రేమండ్ లియు - కౌన్సిల్ మెంబర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
8) యాంగ్ షావో - కౌన్సిల్ మెంబర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
9) డెస్రీ క్యాంప్‌బెల్ - కౌన్సిల్ మెంబర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
10) కాథీ కింబర్‌లైన్ - కౌన్సిల్ మెంబర్, సిటీ ఆఫ్ ఫ్రీమాంట్
11) జూలీ డెల్ కాటాన్సియో, కౌన్సిల్ మెంబర్, నెవార్క్
12) లూసీ లోపెజ్, సీఈవో/ప్రెసిడెంట్, హేవార్డ్ చాంబర్ ఆఫ్ కామర్స్
13) డాక్టర్ పేజ్, సీఈవో, బే ఏరియా కమ్యూనిటీ హెల్త్ (BACH)
14) డాక్టర్ హర్ష, సీఎంవో, బే ఏరియా కమ్యూనిటీ హెల్త్ (BACH)
15) డాక్టర్ అంజలి గులాటి, ట్రస్టీ, ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (AAPI)
16) వివేక్ ప్రసాద్ – బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్
17) లూసీ లోపెజ్, ప్రెసిడెంట్ & సీఈవో, హేవార్డ్ చాంబర్ ఆఫ్ కామర్స్
18) కెన్నెత్ మాక్సీ, బోర్డ్ మెంబర్, హేవార్డ్ చాంబర్ ఆఫ్ కామర్స్
19) లిలీ మీ, ఫ్రీమాంట్ మేయర్ ఎమెరిటా
20) ఫ్రీమాంట్ పోలీస్ డిప్యూటీ చీఫ్ లాన్స్ బ్రెడే
21) ఫ్రీమాంట్ ఫైర్ బెటాలియన్ చీఫ్ గ్రెగ్ బిడ్డిల్
22) ట్రై-సిటీ వాలంటీర్స్ ఫుడ్ బ్యాంక్ డైరెక్టర్ లిండా ల్యూ
ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సమాజ నాయకులు, స్థానిక సేవా సంస్థల సేవలకు గుర్తింపుగా వారిని ఏఐఏ గౌరవించింద. సమాజం పట్ల వారి అంకితభావం ఎనలేనిదని కొనియాడింది. తమ ప్రాంత ప్రజల భద్రత, ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు వారు చేసిన కృషిని ప్రశంసించింది.
పాత తరం, కొత్త తరం మధ్య స్వచ్ఛంద సేవ మరియు పౌర బాధ్యత భావాన్ని పెంపొందించడానికి 18 ఏళ్ల లోపు పిల్లలు తమ కళాకృతులను ప్రదర్శించారు. ఆ పోటీ విజేతలను సత్కరించారు.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి భారతీయ సంస్కృతి, వారసత్వం గురించి చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఒక చక్కని వేదికను అందిస్తున్న ఎన్ జీవో. సభ్యుల మధ్య సాంస్కృతిక మరియు సామాజిక పరిచయాలను ప్రోత్సహించడం AIA లక్ష్యం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం,
భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సంస్కృతిని సభ్యలతో పంచుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు.
సిలికాన్ వ్యాలీలో 50కి పైగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సమూహం ఈ ఏఐఏ. “స్థానిక సమాజానికి తిరిగి ఇవ్వడం” అనే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు దోహదపడిన భాగస్వాములు, అధికారులు మరియు సమాజ సభ్యులకు ఈ ఏఐఏ కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక సమాజాన్ని బలోపేతం చేసే ఇటువంటి ప్రయత్నాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తోంది.