వైసీపీ అధినేత జగన్‌కు వరుసకు కుమారుడు అయ్యే.. సిరిగి రెడ్డి అర్జున్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అర్జున్ రెడ్డి సోషల్ మీడియాలో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన.. అప్పటి ప్రతిపక్ష నాయకులు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకర వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదేవిధంగా కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ ప్రచారం చేశారు.
అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత గుడివాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో గుడివా డ పోలీసులు ఏడాది కిందటే కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అర్జున్ రెడ్డి విదేశా లకు పరారయ్యాడు. దీంతో వేచి చూసిన గుడివాడ పోలీసులు.. లుక్ ఔట్(కనిపిస్తే.. పట్టుకోండి) నోటీసులు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాల్లోనూ అర్జున్ రెడ్డికి సంబంధించిన లుక్ ఔట్ నోటీసులు ఉన్నాయి.
తాజాగా రెండు రోజలు కిందట శంషాబాద్ విమానాశ్రయానికి అర్జున్ రెడ్డి రాగానే.. ఆయనను అక్కడి సి బ్బంది పట్టుకున్నారు. వెంటనే గుడివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి.. అర్జున్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా అర్జున్ రెడ్డి గుడివాడ పోలీస్ స్టేష న్‌కు విచారణ నిమిత్తం వెళ్లగా... పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా.. అర్జున్ రెడ్డిపై.. రాష్ట్ర వ్యాప్తం గా సోషల్ మీడియా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మూడు పెళ్లిళ్లపైనే..
గతంలో అర్జున్ రెడ్డి చేసిన వీడియోలను కొన్నాళ్ల కిందట సోషల్ మీడియాలో తొలగించారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై కామెంట్లు చేయడంతోపాటు.. ఇతరత్రా అసాంఘిక చర్యలకు కూడా పాల్పడ్డాడు. అదేవిధంగా చంద్రబాబు అప్పట్లో రోదించిన తీరుపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించి.. వాటిని వైరల్ చేశాడు. నారా లోకేష్ పాదయాత్రపైనా సెటైరికల్‌గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి హల్చల్ చేశాడు.