వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై బీజేపీ సీనియర్ నేత, ఏపీకి చెందిన మంత్రి సత్యకుమార్ యాద వ్ అదే రేంజ్‌లో కామెంట్స్ చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని తప్పుబడుతూ .. జగన్ కోటి సంతకాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ సంతకాలను గవర్నర్ నజీర్‌కు అందించా రు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కీలక హెచ్చరికలు చేశారు. ``మా మాట కాదని ఎవరైనా కాంట్రా క్టు దక్కించుకుంటే.. మేం అధికారంలోకి వచ్చాక జైలుకు పంపిస్తాం`` అని వార్నింగ్ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఎవరికి జైలుకు పంపిస్తారంటూ.. ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని సూచించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉన్న వైసీపీ ఎంపీ గురుమూర్తిని జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. పీపీపీ విధానాన్ని తీసుకువచ్చిన నీతి ఆయోగ్ సభ్యులను పంపిస్తారా? అని నిలదీశారు. ఇక, పీపీపీ మోడల్ అయినా.. మరే మోడల్ అయినా.. త్వరగా పూర్తి చేయాలని చెప్పిన ప్రధాన మంత్రి మోడీని జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు.
ఇవన్నీకాకుండా.. పీపీపీ విధానాన్ని సమర్థించి.. వైసీపీ అనుకూల వ్యక్తులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజ న వ్యాజ్యాలను కొట్టివేసిన హైకోర్టు న్యాయమూర్తులను జగన్ జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నల వర్షం కురి పించారు. జగన్ వల్ల ఏమీ కాదని.. ఆయన బెదిరింపులను ఎవరూ పట్టించుకోలేరన్నారు. అంతేకాదు.. మరోసారి జైలుకు వెళ్లకుండా తనను తాను కాపాడుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. 30 కేసుల్లో 16 నెల ల పాటు జైలుకు వెళ్లిన వచ్చిన జగన్.. మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
కూటమిదే మళ్లీమళ్లీ..
రాష్ట్రంలో కూటమి సర్కారు బలంగా ఉందని సత్యకుమార్ అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇది తాను చెబుతున్న మాట కాదని.. ప్రజలే అంటున్నారని వ్యాఖ్యానించారు. వంద మంది జగన్‌లు కట్టకట్టుకుని వచ్చినా.. ఏపీలో మరోసారి అధికారంలోకి రాలేరని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. మొత్తానికి జగన్‌కు మాటకు మాట బదులు చెప్పేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.