ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం పర్యటక ప్రాంతంలో ఉగ్రమూకలు జరిపిన దాడి గురించి అందరికీ తెలిసిందే. ఈ పరిణామం.. దేశాన్నేకాదు.. ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. ఆనాటి ఘటనలో ఒక నేపాలీ పౌరుడు సహా 27 మంది మృతి చెందారు. తెలంగాణ, ఏపీలకు చెందిన వారు కూడా ఉన్నారు. దీనికీ ప్రతీకారంగా.. భారత ప్రభుత్వం `ఆపరేషన్ సిందూర్` పేరు తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలే లక్ష్యంగా బెబ్బులిలా విరుచుకుపడింది. మూడు రోజులే ఈ దాడులు జరిగినా.. పాకిస్థాన్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా ఇరు దేశాల అధికారులు ఒక అవగాహనకు వచ్చి.. ఈ కాల్పులను తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే.. ఆపరేషన్ సిందూర్‌పై తరచుగా పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. తామే పైచేయి సాధించామని.. భారత్‌లోనిఅనేక స్థావరాలను కూల్చామనిచెబుతూ వస్తోంది. అయితే..దీనికి ఆధారాలు చూపించాలని భారత్ కూడా ఎదురు దాడి చేసింది. కానీ.. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఆధారాలను చూపించలేక పోయింది. అయితే.. తాజాగా మరోసారి పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. అది కూడా ఆదేశ అధ్యక్షుడే కావడం మరింత విశేషం. దీంతో తాజా ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ అధ్యక్షుడు.. తాజాగా ఆదివారం సాయంత్రంనిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆపరేషన్ సిందూర్‌పై అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తొలిసారి స్పందించారు.
``భారత్ ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ చేసిందని నాకు సైన్యం నుంచి కబురు వచ్చింది. నేనేం చేయాలో కూడావారు చెప్పారు. తక్షణమే నన్ను బంకర్లలోకి వెళ్లిపోవాలని సూచించారు.`` అని జర్దారీ తెలిపారు. అయితే.. పరిస్థితి అంత భీకరంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. దీంతో తాను సైనికుల సూచనలను పాటించలేదన్నారు. కానీ.. భారత్ తీవ్రంగా దాడి చేసిందని పత్రికలు రాశాయి. తర్వాత..సంధికుదిరిందన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చకు దారి తీశాయి. ఆపరేషన్ సిందూర్‌పై తామే పైచేయి సాధించామనిచెబుతూ వచ్చిన పాక్.. ఇప్పుడు అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిలదీసింది.