ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలకు.. మరో మూడేళ్ల వరకు దాదాపు సమయం ఉంది. అంటే.. 2029 వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. సాధారణంగా ఇలాంటి సమయంలో స్వేచ్ఛగా నాయకులు.. పాలకులు కూడా పనులు చేసుకునేందుకు అభివృద్ధిని పరుగులు పెట్టించుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా.. ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి.. మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అయితే.. దీనికి భిన్నమైన వాతావరణం రెండు రాష్ట్రాల్లోనూ కనిపించింది. ఒకవైపు అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. మరోవైపు.. విపక్షాల దూకుడుపై ప్రభుత్వం ఒకింత జంకాయనే చెప్పాలి.
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. అసలు 11 స్థానాలకు పరిమితం అయిపోయిన వైసీపీ ప్రజల మధ్యకురాలేదు. కనీసం ప్రజల మధ్యకు రావాలన్న డిమాండ్లు వచ్చినా.. ఆ పార్టీ అధినేత జగన్ ఎక్కడా పట్టించుకోలేదు. ఓ మూడు కీలక సమయాల్లో వచ్చి.. ఆయా కార్యక్రమాలు మాత్రమే పూర్తి చేసుకున్నారు. పొగాకు, మిర్చి, మామిడి రైతులను పరామర్శించేందుకు.. మరో సందర్భంలో తెనాలిలో యువకులను పోలీసులు బహిరంగంగా కొట్టినప్పుడు మరోసారి వారి కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లారు. గుంటూరులో పార్టీ కార్యకర్త మృతి చెందిన ఘటనలో ఆ కుటుంబాన్నిపరామర్శించేందుకు బయటకు వచ్చారు.
కానీ.. కూటమి ప్రభుత్వం మాత్రం సమయంసందర్భంతో సంబంధం లేకుండా.. జగన్ నామ స్మరణ చేసింది. ఎక్కడ ఏ కార్యక్ర మం నిర్వహించినా.. జగన్ పేరు లేకుండా కార్యక్రమం ముగియలేదు. జగన్ మరోసారి అధికారంలోకి రాకూడదంటూ.. అధికా రంలో ఉన్న నాయకులు ఈ ఏడాది మొత్తం ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలుగా నిర్వహించారు. ముఖ్యంగా సీఎం చంద్రబా బు గుజరాత్ నమూనాను ప్రకటించారు. అక్కడ వరుసగాబీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని.. సో.. అభివృద్ధి సాకారం అయిందని.. ఇప్పుడు ఏపీలోనూ అలానే రావాలని.. జగన్ వద్దని ఆయన పిలుపునిచ్చారు. దీనిని బట్టి వైసీపీ జోష్ అలానే ఉందని అనుకు నేలా చర్చకు వచ్చేలా చేసింది.
ఇక, తెలంగాణలోనూ.. దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది.అసెంబ్లీకి రాకుండా.. ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌లోనే గడిపేసిన కేసీఆర్.. గురించి.. బీఆర్ ఎస్ పార్టీ నాయకుల కంటే కూడా.. అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే ఎక్కువగా హవా కనిపించింది. ఏం చేసినా.. కేసీఆర్.. అన్నట్టుగా ఎక్కడ సభ పెట్టినా.. ఎక్కడ ఏకార్యక్రమం నిర్వహించినా.. కేసీఆర్.. బీఆర్ ఎస్‌ల నామ స్మరణ లేకుండా ముగియలేదు. తద్వారా అధికారంలో ఉన్న పార్టీలే.. ప్రతిపక్షాలకు అప్రకటిత ప్రచారం చేశాయా? అనే చర్చ కూడా ఒక దశలో తెరమీదకి రావడం గమనార్హం. మొత్తంగా.. బీఆర్ ఎస్, వైసీపీల జోష్ అయితే.. 2025లో ఒకే తరహాలో కొనసాగడం గమనార్హం.