ఇటీవల `ఓజీ` మూవీతో సాలిడ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం `ఉస్తాద్ భగత్ సింగ్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కొత్త ప్రాజెక్ట్ లాక్ అయింది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. నిజానికి సురేందర్ రెడ్డి, పవన్ కాంబో ఎప్పుడో సెట్ అయింది. చాలా కాలం నుంచి హోల్డ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు లైన్ క్లియర్ చేసుకుంది.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి లాస్ట్ ఫిల్మ్ `ఏజెంట్` దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక డిజాస్టర్ డైరెక్టర్ తో పవన్ తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం ఒక వర్గం అభిమానులను కొంచెం కలవర పెడుతోంది. కానీ మెగా హీరోలతో సురేందర్ రెడ్డికి మంచి ట్రాక్ రికార్డే ఉంది. గతంలో `రేస్ గుర్రం`, `ధృవ`, `సైరా నరసింహా రెడ్డి` వంటి హిట్స్ ను మెగా హీరోలకు అందించడంతో.. సురేందర్ రెడ్డి-పవన్ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.