తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఈ నెల 20న నోటిఫికేషన్ రానుంది. మొత్తం 117 మునిసిపాలిటీలకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి జోరుగా పెరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ వేడి మరింత కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా బీజేపీ-బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తీవ్రంగా కనిపి స్తోంది. ఈ మూడు పార్టీలకు తోడు చిన్నా చితకా పార్టీలు కూడా రెడీగానే ఉన్నాయి.
కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం!
అధికార పార్టీ కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో ప్రజలను ఆకర్షించేందుకు రెడీ అవుతోంది. 1) మునిసిపల్ ఎన్ని కలు జరగనున్న ప్రతి జిల్లాకు ఒక మంత్రిని కేటాయించనున్నారు. తద్వారా.. మంత్రుల కనుసన్న ల్లోనే నాయకులు నడవనున్నారు. 2) విస్తృత పర్యటనలు, ప్రచారాలు: సీఎం రేవంత్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రధానంగా భావిస్తున్నారు. దీంతో ఆయనే స్వయంగా 9 జిల్లాల్లో ఏకబిగిన వరుసగా ప్రచారం చేయనున్నారు. జడ్చర్ల నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. 3) క్షేత్రస్థాయి కార్యకర్తలను దారిలో పెట్టడం: ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. గత ఎన్నికల తర్వాత.. మరోసారి కార్యకర్తలను లైన్ లో పెట్టాలని నిర్ణయించారు.
బీఆర్ ఎస్ కూడా..
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ కూడా.. పలు వ్యూహాలను రెడీ చేసుకుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరే కతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. వాస్తవానికి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నూ దీనికి ప్రాధాన్యం ఇచ్చినా.. ఫలితం దక్కలేదు. కానీ.. ఈ దఫా మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఇక కేటీఆర్.. హరీష్‌రావులు ప్రధాన ప్రచారకర్తలుగా మునిసిపల్ ఎన్నికల ను ముందుకు తీసుకువెళ్లనున్నారు. కార్యకర్తల అసంతృప్తిని తగ్గించనున్నారు.
బీజేపీ ఇలా..
ఇక, బీజేపీ వ్యవహారానికి వస్తే.. ఈ పార్టి కూడా మునిసిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టినా.. ఆశించిన స్థాయిలో నాయకుల మద్య సఖ్యత కనిపించడం లేదు. ఇదే పెద్ద మైనస్‌గా మారింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావుకు.. కీలక నేతలకు మధ్య వివాదాలు అంతర్గతంగా కొనసాగుతున్నాయి. దీంతో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకుని మునిసిపల్ ఎన్నికలకు రెడీ కావడం అనేది ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి.