మాజీ సీఎం, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. పెద్దమనసు చాటుకున్నారు. ఇద్దరు పేద విద్యార్థులకు.. ఆయన ఆర్థిక సాయం అందించారు. వారి పూర్తికాల చదువుకు అయ్యే సాయాన్ని అందించనున్నట్టు ప్రక టించారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉంటున్న కేసీఆర్.. స్థానికంగా ఉంటున్న రెండు కు టుంబాలకు చెందిన బీటెక్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందించా రు. వారి చదువుల బాధ్యత తాను తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నరాజు సత్తయ్య ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బీటెక్ చదువుతున్న ఆయన కుమారుడు నవీన్.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కాలేజీ ఫీజులు కట్టలేక చదువును ఆపేసే నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా ఎర్రవల్లి గ్రామానికే చెందిన పెద్దోళ్ల సాయి అనే వ్యక్తి కూడా రహదారి ప్రమాదంలో మృతి చెందారు. ఈయన కుమారుడు అజయ్ కూడా బీటెక్ చదువుతున్నాడు. ఫీజులు కట్టే స్తోమత లేక చదువు ఆపేయాలని నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు సంబంధించిన వార్తలు స్థానిక పత్రికల్లో వచ్చాయి. ఈ విషయం కేసీఆర్ వరకు చేరింది. దీంతో స్వయంగా వారిని తన ఇంటికి పిలిపించిన కేసీఆర్.. ఒక్కొక్క విద్యార్థికీ రూ.5 లక్షల చొప్పున సాయం చేశారు. అంతేకాదు.. భవిష్యత్తులో అయ్యే ఖర్చులు కూడా తనే ఇస్తానని.. చక్కగా చదువుకోవాలని వారిని కోరారు. వీరిద్దరి ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజులను చెల్లిస్తానని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఆనందంతో పొంగిపోయారు.
గతంలో కూడా..
కేసీఆర్ గతంలో కూడా ఇలాంటి ఆపదలో ఉన్న వారి కుటుంబాల చదువులకు సాయం చేశారు. అయితే.. ఇలాంటి సాయాలను ఎప్పుడూ ఆయన ప్రచారానికి వాడుకోకపోవడం గమనార్హం. తాజాగా.. ఈ విషయాన్ని పార్టీకార్యాలయం ప్రకటించింది. ఇదిలావుంటే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి, విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన సత్తయ్యలకు ప్రభుత్వ పరంగా కూడా సాయం అందేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు.