ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాంను నియమించారు. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు కోమటి జయరాం ఆ పదవిలో కొనసాగబోతున్నారు. గతంలో తానా అధ్యక్షులుగా కూడా కోమటి జయరాం పనిచేశారు. ఈ సందర్భంగా కోమటి జయరాంకు నమస్తే ఆంధ్ర తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.