జనసేన పార్టీని.. బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపుని చ్చారు. తనను బలోపేతం చేస్తే.. తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. తాను ఏదీ పైకి డాంబికంగా చెప్పనని అన్న ఆయన.. ప్రజల కోసం చేసే పనులకు ప్రచారం అవసరం లేదన్నా రు. నియోజకవర్గంలో ఇప్పటికే రహదారులు, పైవంతెనల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వాటి కన్నామెరుగ్గా రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న శ్రీపాదశ్రీవల్లభుడు వెలిసిన పురహూతికా అమ్మవారి పీఠం దేశంలోనే ఎంతో శక్తిమంతమైందని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంనుంచి తాను పోటీ చేయాలని అనుకోలేదని తెలిపారు. తాను కేవలం నిమిత్తమాత్రుడినని ఆ దేవుడి కృపతోనే ఇక్కడ నుంచి పోటీ చేయడం సాధ్య మైందని తెలిపారు. పురహూతికా అమ్మవారి ఆశీర్వాదం.. ప్రజల ఆశీస్సులతోనే తాను విజయం దక్కించు కున్నానన్నారు. పార్టీని బలోపేతం చేస్తే.. మరిన్ని కార్యక్రమాలుచేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
అయితే.. తనకు అధికారం ఉన్నా.. లేకపోయినా.. పిఠాపురం ప్రజలకుమేలు చేసేందుకు ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే 15 ఏళ్లు పొత్తు కొనసాగుతుందని మరో సారి ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని.. ఆయన అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు.. పొత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా కూటమిని బలహీన పరిస్తే.. అది వారికే కాకుండా.. రాష్ట్రానికి కూడా నష్టమని హెచ్చరించారు.