ట్రంప్ నకు బుల్లెట్ దిగుతుందన్న ఇరాన్!

admin
Published by Admin — January 15, 2026 in International
News Image
ఇరాన్ సుప్రీం ఖమేనీకి వ్యతిరేకంగా గళమెత్తిన నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం అణచివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ దుశ్చర్యలు ఆపకుంటే ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగుతుందని అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ నకు ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. గతంలో ట్రంప్ పై జరిగిన దాడిలో బుల్లెట్ మిస్సైందని, ఈ సారి మిస్ కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.

2023లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తాకింది. ఆ దాడి వెనుక ఇరాన్ హస్తముందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోను తాజాగా ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ఈ సారి బుల్లెట్ గురి తప్పదని బెదిరించింది.

ఆ రకంగా న్యూస్ టెలీకాస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా ఏ నిమిషంలో అయినా ఇరాన్ లోని టెహ్రాన్ పై దాడికి పాల్పడవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఈ వార్నింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, ఆ వార్నింగ్ పై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Tags
Iran USA Trump warning bullet won't miss
Recent Comments
Leave a Comment

Related News