తెలంగాణలో ఓ సీనియర్ మంత్రి, ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిల మధ్య సంబంధం ఉందని ఎన్టీవీలో ఈ నెల 8న ప్రసారమైన కథనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులు చారి, సుధీర్ లను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అ అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించారు. తాజాగా ఆ ముగ్గుూ బెయిల్ పై విడుదలైన నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ పై దొంతు రమేష్ విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత యూట్యూబ్ ఛానళ్లకు చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేశారని, కానీ, వర్కింగ్ జర్నలిస్టులను అరెస్ట్ చేయలేదని అన్నారు. అయితే, చేయని తప్పుకు రేవంత్ ప్రభుత్వం తమను అరెస్ట్ చేసిందని, 24 గంటల పాటు మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురినీ రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు కోరగా...కోర్టు నిరాకరించింది. వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ రకమైన అరెస్టులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.