ఎవరైనా రాజకీయాల్లో రాణించేందుకు అందరినీ చేరువ చేసుకోవాలి. అందరితోనూ కలివిడిగా ఉండాలి. కానీ, వైసీపీ అధినేత జగన్‌లో ఈ తరహా లక్షణాలు కనిపించడం లేదనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోం ది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. తర్వాత కూడా తనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతున్నా రు తప్ప.. నాయకుల నాడిని.. ప్రజల ఆలోచనలను పట్టుకోలేక పోతున్నారన్న విమర్శలు వున్నాయి. తాజాగా మరింతగా పార్టీని జగన్ డ్యామేజీ చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
మూడు రీజన్లు:
1) సొంత నేతలకు దూరం: ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్‌కు అండగా ఉంది. గత 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకుఎంతో సహకరించింది. జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. పెద్ద ఎత్తున సాయం అందించింది. కానీ, పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయడం.. వారికి కేటాయించాల్సిన పదవులు కూడా.. బీసీలకు ఇవ్వడం వంటివి జగన్‌ను సొంత పార్టీనాయకులకు, అంతేకాదు.. బంధువులకు కూడా దూరం చేసింది.
2) బీసీల మాటేంటి: టీడీపీకి దన్నుగా ఉన్న బీసీలను.. తనవైపు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నించా రు. ఈ క్రమంలోనే జనరల్‌కు కేటాయించిన మునిసిపల్ స్థానాలను కూడా ఆయన బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. తద్వారా వారిలో ఉన్న టీడీపీ సెంటిమెంటును తగ్గించే ప్రయత్నం చేయాలని అనుకు న్నారు. కానీ.. అప్పటి వరకు ఉన్న బీసీ సెంటిమెంటు కాస్తా.. తుడిచి పెట్టుకుపోయింది. ఏదో చేయాలని అనుకున్న జగన్‌కు.. ఉన్నది కూడా పోవడం గమనార్హం.
3) సంక్షేమాన్ని మించి: తమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అంటూ.. ప్రచారం చేసుకున్న జగన్‌కు అదే సంక్షేమం పెద్ద దెబ్బకొట్టింది. అభివృద్ధిని చెప్పుకొనే విషయంలో వెనుకబడిన కారణంగా.. కేవలం సంక్షే మ ప్రభుత్వం అన్న మాటనే నమ్ముకుని ముందుకు సాగారు. పలితంగా.. అటు సంక్షేమం.. ఇటు అభివృ ద్ధి రెండూ దెబ్బతిని వైసీపీ 11కు పరిమితం అయింది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుం దా? అనేది ఇప్పటి నుంచి చేపట్టే కర్యక్రమాలు.. దూకుడు పైనే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా.. వైసీపీ కి సంబంధించి పోయింది కొంత.. పోగొట్టుకుంటోంది ఇంకొంత.. అన్నట్టుగా ఉంది.