తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది తమన్నా భాటియా. దాదాపు 15 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అగ్ర హీరోలందరి సరసన మెరిసింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పించింది. అయితే, వెండితెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ వెనుక ఒక చేదు జ్ఞాపకం ఉందన్న విషయం తాజాగా బయటపడింది.
తమన్నా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ సంఘటన గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, స్క్రిప్ట్‌లో లేని ఓ బోల్డ్ సీన్ చేయమని ఆమెను అడిగారట. ఆ దృశ్యంలో ఇంటిమసీ ఎక్కువగా ఉండటంతో, అది తన కంఫర్ట్ జోన్ కాదని తమన్నా నో చెప్పిందట.
తమన్నా ఆ సీన్ చేయనని ఖరాకండిగా చెప్పడంతో సదరు సౌత్ స్టార్ హీరో ఒక్కసారిగా అసహనానికి గురయ్యారట. సెట్‌లో అందరూ చూస్తుండగానే ఆమెపై గట్టిగా అరిచి, ``ఈ హీరోయిన్ వద్దు.. వెంటనే మార్చేయండి`` అంటూ తీవ్రంగా అవమానించాడని తమన్నా వెల్లడించింది. అంతమంది ముందు సదరు హీరో అలా ప్రవర్తించడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని..ఆ సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, ఆ అవమానంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయని మిల్కీ బ్యూటీ పేర్కొంది. అయితే, కాసేపటి తర్వాత ఆ హీరో తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడి, ఆమె వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడట. జరిగిన గొడవ సర్దుమణిగినా, ఆ చేదు అనుభవం మాత్రం తన మనసులో అలాగే ఉండిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.