అధికారంలో ఉన్నప్పుడు.. నాయకులు ఒకలా ఉంటారు. అదే పోతే.. మరోలా మారిపోతారు. అచ్చంగా ఇలానే వ్యవహరిస్తున్నారు.. శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. 2019-24 మధ్య మంత్రిగా ఉన్న సీదిరికి అన్నీ మంచిగా కనిపించాయి. ఇది రాజకీయాల్లో ఉన్న నాయకులకు సహజ ధోరణి. ఆయనకు కూడా అలానే అనిపించింది. కానీ, అధికారం కోల్పోయిన తర్వాత.. కళ్లద్దాలు మారిపోయినట్టుగా అన్నీ చెడుగా కనిపిస్తున్నాయి.
పైగా.. తనను తాను హైలెట్ చేసుకునేందుకు.. తన గ్రాఫ్‌ను పెంచుకునేందుకు అప్పలరాజు తిప్పలు పడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. 2024లో అధికారం కోల్పోవడంతోపాటు.. ఆయన కూడా చిత్తుగా ఓడిపోయారు. ఆ సమయంలో కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో పోలీసులపై తీవ్ర ఆరోపణలతో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పోలీసు స్టేషన్‌లు పంచాయతీలకు అడ్డాగా మారాయని.. స్టేషన్లకు టీడీపీ జెండా రంగులు వేసుకోవాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతర ప్రైవేట్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించి ప్రస్తుత పోలీసు స్టేషన్లుకు తాళం వేస్తున్న ఆయన చేసిన వ్యాఖ్యలతో కేసులు కూడా నమోదయ్యాయి.
ఇక, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గౌతు శిరీషను టార్గెట్‌గా చేసుకుని అప్పలరాజు చేస్తున్న విమర్శల్లో రాజకీయం తప్ప వాస్తవాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. పైగా ఆయన పసలేని ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. స్థానిక జగన్నాథ సాగర గట్టు భవన నిర్మాణ వ్యర్థాలతో అక్కడ స్థానికులు చేసుకుంటున్న దాన్ని రాజకీయంగా వాడుకోవాలని వాటాలు పొసగని తన అనుచర కొంతమంది విలేకర్లతో కలసి ఈ అభివృద్ది మాటున ఏదో అక్రమాలు జరుగుతున్నా యన్నది సీదిరి ఆరోపణ. కానీ, ఇతమిత్థంగా ఆయన చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపించలేక పోతున్నారు. అనుకూల సొంత మీడియాను అడ్డు పెట్టుకుని కథనాలు రాయిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. అంతేకాదు.. సొంత పార్టీ నాయకులే రెండుగా చీలిపోయి.. అప్పలరాజు అవినీతి చేస్తున్నారని.. పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేయడం ఇప్పటికీ పలాస ప్రజల కళ్లలో కనిపిస్తూనే ఉంది. అవన్నీ మరిచిపోయినట్టుగా.. వాటికి మసి పూసినట్టుగా ఇప్పుడు అప్పలరాజు వ్యవహారం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అధికారం లేకపోయినా.. తనదేపైచేయిగా ఉండాలన్న అప్పల రాజు ఆలోచనే తప్పుగా ఉందని అంటున్నారు.
అధికారులు సహకరించడం లేదని వారిపైనా బురదజల్లే కార్యక్రమాలకు అప్పలరాజు శ్రీకారం చుట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. అసలు సంబంధమే లేని విషయాలను ఆయన ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ ఫిర్యాదు చేయడం.. ఆరోపణలు చేయడం.. అనుకూల మీడియాలో కథనాలు రాయించడం వంటివి అప్పలరాజు గ్రాఫ్‌ను పెంచకపోగా.. మరింతగా డైల్యూట్ చేస్తున్నాయన్నది వాస్తవమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అప్పల రాజు మంత్రిగా ఉన్నసమయంలో జరిగిన ఉద్యోగ నియామకాల వ్యవహారంలో చోటు చేసుకున్న అవినీతి కూడా ప్రస్తుతం తెరమీదికి వస్తోంది. దీంతో అప్పలరాజు పడుతున్న ఆపశోపాలు బూమరాంగ్ అవుతున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
గౌతు కుటుంబంపై మరకలా.. ?
స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ప్రస్తుత రాజకీయాల వరకు గౌతు లచ్చన్న నుంచి ఆయన మనవరాలిగా శిరీష వరకు.. వేలు పెట్టి చూపించేంత మచ్చలు కానీ.. మరకలు కానీ లేవన్నది శ్రీకాకుళం వాసులకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా తెలిసిందే. గౌతు లచ్చన్న ఆరాధనీయుడు ఎలా అయ్యారన్నది అప్పలరా జుకు తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఇక, ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్యాంసుందర్ శివాజీ కూడా.. తండ్రిబాటలోనే నడిచారు. అనేక సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. ఒక్క రూపాయి అక్రమాలకు తెరదీయకుండా.. నిజాయితీగా వ్యవహరించారు.
ఇప్పుడు తాత, తండ్రి బాటలో నడుస్తున్న శిరీష కూడా అంతే!. ఒక్క మాటలో చెప్పాలంటే.. గౌతు కుటుంబం పలాసకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిందే కానీ... తీసుకున్నది అంటూ.. ఏమీలేదు.. ఒక్క ప్రజాభిమానం.. వారి గుండెల్లో చోటు తప్ప!!. ఈ విషయం అప్పలరాజుకు తెలిసి కూడా.. ఆరోపణలు చేయడం అంటే.. తనను తాను తగ్గించుకునే ప్రయత్నంలో పరుగులు పెట్టడమేనని అంటున్నారు పరిశీలకులు. ఇకనైనా మర్యాద పూర్వక రాజకీయాలు చేస్తే.. ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే.. ఈ దఫా కూడా ఆయనను వైసిపి టికెట్ కేటాయిస్తే పలాస ప్రజలు ప్రతిపక్షంలోనూ కూర్చోపెడతారన్న టాకూ అక్కడ నడుస్తోంది.