బాలీవుడ్‌కు బాగా కలిసి వచ్చిన 2026లో సూపర్ హిట్టయిన హిందీ చిత్రాల్లో ‘తేరే ఇష్క్ మే’ ఒకటి. ధనుష్ మీద అపరిమితమైన అభిమానం చూపించే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్.. ఈ తమిళ నటుడితో చేసిన మూడో చిత్రమిది. ధనుష్ సరసన కృతి శెట్టి నటించిన ఈ చిత్రం.. యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.150 కోట్ల మేర వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ రేంజిలో నిలిచింది.
ఐతే ఇప్పుడీ చిత్రం మీద ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ‘రాన్‌జానా’ చిత్రాన్ని ఈరోస్ సంస్థే నిర్మించింది. ఐతే ఇప్పుడు ‘తేరే ఇష్క్ మే’ మరో సంస్థలో తెరకెక్కింది. కాగా ఆనంద్.. ‘తేరే ఇష్క్ మే’ను ‘రాన్‌జానా’ సీక్వెల్‌గా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశాడని.. అంతే కాక ‘రాన్‌జానా’లోని పాత్రలు కూడా ‘తేరే ఇష్క్ మే’లో కొనసాగాయని.. తమ అనుమతి లేకుండా ఇలా చేసినందుకు రూ.84 కోట్ల నష్ట పరిహారం కట్టివ్వాలని కోర్టును కోరింది ఈరోస్ సంస్థ.
ఈ ప్రొడక్షన్ హౌస్‌తో ఆనంద్‌తో పాటు ధనుష్ తీవ్రంగా విభేదిస్తూ.. ‘తేరే ఇష్క్ మే’ను వేరే బేనర్లో చేశారు. ‘తేరే ఇష్క్ మే’ రావడానికి కొన్ని వారాల ముందే ఈరోస్ సంస్థ ‘రాన్‌జానా’ను రీ రిలీజ్ చేసింది. ఒరిజినల్ క్లైమాక్సులో హీరో పాత్ర చనిపోతుందన్న సంగతి తెలిసిందే. కానీ రీ రిలీజ్ వెర్షన్లో ఏఐ సాయంతో హీరో బతికి ఉన్నట్లు చూపించారు.
దీనిపై ధనుష్, ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఈరోస్ సంస్థ పట్టించుకోలేదు. ఇప్పుడు ‘తేరే ఇష్క్ మే’ టీం తమకు ఏకంగా రూ.84 కోట్లు కట్టాలంటూ కోర్టుకెక్కింది. గత నెలలో ‘అఖండ-2’ రిలీజ్‌ను ఆపింది కూడా ఈరోస్ సంస్థే. 14 రీల్స్ వాళ్లతో ఒక పాత సెటిల్మెంట్ విషయంలో ఆ సంస్థ కోర్టుకెక్కి ‘అఖండ-2’కు బ్రేకులు వేయించింది.