టాలీవుడ్ యువ నటి, `ఖిలాడి` భామ డింపుల్ హయాతి సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన ఘాటైన అందాలతో నెటిజన్ల మనసు దోచుకోవడంలో డింపుల్ ఎప్పుడూ ముందుంటుంది.

అయితే తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో షూట్‌లో ఆమె తన గ్లామర్ డోస్‌ను మరింత పెంచేసింది. ఈ పిక్స్ లో డింపుల్ ఒక స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ఆమె ధరించిన బాడీకాన్ డ్రెస్ ఆమె పర్‌ఫెక్ట్ ఫిగర్‌ను ఎలివేట్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా ఆ డ్రెస్‌లో డింపుల్ ఇస్తున్న కిల్లింగ్ పోజులు చూస్తుంటే కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే.

కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తోనూ ఈ బ్యూటీ ఆకట్టుకుంటోంది. సింపుల్ మేకప్, లూజ్ హెయిర్, మరియు క్లాసీ యాక్సెసరీస్‌తో ఆమె లుక్ అదిరిపోయింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ``హాట్నెస్ ఓవర్ లోడెడ్`` అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

కెరీర్ విషయానికి వస్తే.. `ఖిలాడి` మూవీతో తెలుగులో హీరోయిన్ గా తొలి హిట్ అందుకుంది ఈ డస్కీ బ్యూటీ. ఆ తర్వాత `రామబాణం`తో డీలా పడినా.. రీసెంట్ గా మరోసారి తన లక్కీ హీరో రవితేజతో జోడి కట్టి `భర్త మహాశయులకు విఘ్నప్తి` మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో డింపుల్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించింది. అదే సమయంలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది. ఏదేమైనా సరైన కంటెంట్ ఉన్న సినిమా పడితే, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఆమెకు కష్టమేమీ కాదనే చెప్పొచ్చు.
