వైసీపీ పాల‌న త‌లుచుకుంటే. చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

admin
Published by Admin — February 09, 2026 in Andhra
News Image

రెండు రోజుల కింద‌ట క‌ర్నూలు వెళ్లా. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడా. వారిని ఒక మాట అడిగా.. గ‌త వైసీపీ పాల‌న‌కు, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వానికి తేడాచెప్ప‌మ‌ని కోరా. వారు గుండెలు ప‌ట్టుకుని.. అమ్మో అన్నారు. వైసీపీ పాల‌నను త‌లుచుకుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ‌ని చెప్పారు. ఇదీ.. నాటి జ‌గ‌న్ పాల‌న‌`` అని చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం లో పాల‌న తీరుతెన్నులు, భ‌విష్య‌త్తులో చేయాల్సిన ప‌నుల‌పై ఆయ‌న మంత్రులు, వివిధ శాఖ‌ల‌ కార్య‌ద‌ర్శులతో సోమవారం సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హించారు.

పేద‌ల‌ను అడిగితే చెబుతారు!

ఈ స‌మావేశంలో వివిధ అంశాల‌తో పాటు వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అనేక అంశాల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. “రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాం. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. క‌నీసం పేద‌ల‌కు ప‌ట్టెడు అన్నం కూడా పెట్టాల‌న్న ఆలోచ‌న లేదు. ఇప్పుడు పేద‌లకు రూ.5 కే భోజ‌నం ల‌భిస్తోంది. ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అన్న‌ది పేద‌ల‌ను అడిగితే తెలుస్తుంది.`` అని వైసీపీపై చుర‌క‌లు అంటించారు. అదేవి ధంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నామ‌న్నారు.

రైతులకు ఎవ‌రు ఏం చేశారో లెక్క‌ల‌తో చెప్పాలి!

గ‌త ప్ర‌భుత్వంలో రైతుల‌కు ఏం చేశారో.. ప్ర‌స్తుతం ఏం చేస్తున్నామ‌నో.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నా మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అధికారులు కూడా గ‌ణాంకాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని సూచించారు. ``మీరుప‌నిచేయ‌డ‌మే కాదు.. ఆ ప‌నిని ప్ర‌జ‌ల‌కు కూడా వివ‌రించాలి`` అని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 11 వంద‌ల‌ కోట్ల రూపాయ‌ల‌ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నామ‌న్నారు. ధాన్యం కొనుగోళ్లకు కూడా రూ.10 వేల కోట్ల మేర 48 గంటల్లోనే చెల్లింపులు చేశామ‌న్నారు. ఈ విష‌యాల‌ను వివ‌రించాల‌ని సూచించారు.

హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వ‌లేద‌ని..

వైసీపీ హ‌యాంలో జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మం కోసం భూములు ఇచ్చిన రైతుల ఇళ్ల‌ను కూల్చేశార‌ని.. చంద్ర‌బాబు గుర్తు చేశారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వ‌లేద‌ని.. ఓ ప్రైవేటు భూమిని అక్రమంగా 22 ఏలో పెట్టేశారు.(అసైన్డ్ లెక్క‌ల్లోకి) ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ తరహాలో అధికారం దుర్వినియోగం చేశారని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది ఒక్క తాడేపల్లిలోనే కాదు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంద‌న్నారు. భూవివాదాలు లేకుండా... పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నామ‌ని తెలిపారు. 

Tags
Cm chandrababu ycp jagan
Recent Comments
Leave a Comment

Related News