ఏపీ రాజధాని అమరావతిలోని పలు గ్రామాల్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కాలి నడకన పర్యటించారు. సీఎం చంద్రబాబు, పలువురు అధికారులతో కలిసి.. ఉండవల్లి సమీపంలోని ఉన్న వ్యవ సాయక్షేత్రాన్ని ఆయన సందర్శించారు సాగుకు సంబందించిన విధానాలను పరిశీలించారు డ్రోన్స్ఏఐ టేక్నాలాజీ సహకారం తో చేపట్టిన సాగు గురించి బిల్ గేట్స్ బృందానికి మంత్రులు, అధికారులు వివరిం చారు.
అనంతరం.. రాజధాని ప్రాంతంలోని మందడం.. ఐతవరం గ్రామాల్లోనూ కాలిబాటనే గేట్స్, సీఎం చంద్ర బాబు పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. చంద్రబాబు దూర దృష్టిని పదే పదే కొనియాడిన గేట్స్.. రాజధాని నిర్మాణ పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రేయింబవళ్లు కొనసాగుతున్న తీరును సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. దీనికి ముందు రాజధా ని అమరావతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని ఆర్‌టీజీఎస్ కేంద్రా న్ని బిల్ గేట్స్ సందర్శించారు.
పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ పరిశీలించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవ ని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల పురోగతిని బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించారు. వాట్సప్ గవర్నె న్స్ ద్వారా పౌర సేవలను సులభ తరం చేయడాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు . బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని.. అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శ కంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రాజధాని రైతుల స్వాగతం
రాజధాని గ్రామాలను పరిశీలించేందుకు వచ్చిన గేట్స్ బృందంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇత ర మంత్రులకు రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. రహదారికి ఇరువైపులా నిలబడి.. స్వాగతం పలికారు. మహిళా రైతులు ఇచ్చిన పునుగులను బిల్ గేట్స్ తిన్నారు. ఈ సందర్భంగా రైతులు.. రాజధానికి ఇచ్చిన భూముల వివరాలను, వారు చేసిన త్యాగాలను సీఎం చంద్రబాబు వివరించారు. రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో 33 వేల ఎకరాలకుపైగా తీసుకున్న తీరును గేట్స్ ప్రశంసించారు