గేట్స్ ఫౌండేష‌న్ తో రాష్ట్రం మ‌రింత అభివృద్ధి

admin
Published by Admin — February 17, 2026 in Andhra
News Image

బిల్ గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో రాష్ట్రం మ‌రింత అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌ని.. సీఎం చం ద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా సాంకేతిక విప్ల‌వంలో ఇది మ‌రింత దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌ల‌(ఆర్‌టీజీఎస్‌)లో మ‌రింత సౌల‌భ్యం క‌లుగుతుంద‌ని.. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందిపుచ్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నా రు.

ప్ర‌జ‌ల జీవితాల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చంద్ర‌బాబు తెలి పారు. పాల‌న‌లో సాధ్య‌మైనంత వేగాన్ని తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నామ‌న్నా రు. గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో ఈ ప్ర‌య‌త్నం మ‌రింత వేగంగా ముందుకు సాగుతుంద‌ని తెలిపారు. బిల్ గేట్స్‌ను 1990లో తొలిసారి క‌లిసిన‌ప్పుడే.. సాంకేతిక‌త‌ను వినియోగించి ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పులు తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైందని చంద్ర‌బాబు తెలిపారు.

ఆనాటి ప్ర‌య‌త్నాలు.. త‌ర్వాత కాలంలో సాంకేతికత ద్వారా పౌరసాధికారత సాధ్యమనే స్ఫూర్తిని ఇచ్చిం ద‌న్నారు. ఈ రోజు సాంకేతిక‌త ఆధారంగా వేగ‌వంతంగా పాల‌న సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని చం ద్రబాబు పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో మ‌రింత‌గా పురోగ‌మించేందుకు అవ‌కాశం ఏర్ప‌డు తుందన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్‌ ఫౌండేషన్ ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో స‌మ‌గ్ర‌, సుస్థిర అభివృద్ధికి.. గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌కారం ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. తొలిసారి తాను.. బిల్ గేట్స్‌తో భేటీ కావ‌డం.. సీఎం చంద్ర‌బాబు స‌హ‌కారంతో రాష్ట్ర అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌లకు అత్యంత వేగంగా.. పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లు అందించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని వ్యాఖ్యానించారు.

Tags
Bill gates pawan kalyan cm chandrababu development of ap
Recent Comments
Leave a Comment

Related News