వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. 2023లో సంక్రాంతి పండు గ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. దీనికిగాను పింఛన్ల నుంచి రూ.200 చొప్పున లక్కీ డ్రా కింద టికె ట్ రుసుము వసూలు చేశారన్న కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణకు రాలేదు. అయితే.. గత నెల 30న సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడిన నేపథ్యంలో అంబటిపై కేసునమోదైంది. దీంతో ఆయ నను అరెస్టు చేసి.. రాజమండ్రి జైలుకు తరలించారు.
ఇక, ఆ క్రమంలోనే అంబటిపై 36 కేసులు నమోదైనట్టు పోలీసులు సదరు జాబితాను విడుదల చేశారు. ఇటీవల సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. మరోవైపు.. చంద్రబాబుపై దుర్భాషల కేసులో అంబటికి బెయిల్ లభించినా.. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాత్రం స్థానిక కోర్టు ఆయ నకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో అంబటి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన గుంటూరు కోర్టు సంక్రాతి సంబరాల కేసులో ఆయనకు బెయిల్ మం జూరు చేసింది. దీంతో జైలు నుంచి అంబటి విడుదల అయ్యారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడిన అంబటి.... చంద్రబాబు, లోకేశ్ లపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఇంటిపై 7 గంటలపాటు దాడి జరిగిందని, ఆ దాడిని చంద్రబాబు లోకేశ్ ఫోన్లలో మానిటర్ చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఎంజాయ్ చేశానని, ఈ కేసులకు భయపడబోనని అంబటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.