పుష్ప స్ట‌యిల్లో జ‌గ‌న్‌కి ఇచ్చిప‌డేసిన లోకేష్‌!

admin
Published by Admin — February 19, 2026 in Politics
News Image

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ మీడియాలో గ‌త రెండు రోజులు ప‌లు క‌థ‌నాలు వస్తున్నాయి. ప్ర‌జాధ‌నా న్ని ఆయ‌న మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల సొమ్ముకు విలువే లేకుండా పోయింద‌ని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గ‌త నెల‌లో ఇండియా-శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య క్రికెట్‌ మ్యాచ్ జ‌రిగింది. ఇది కొలొంబోలో జ‌రిగింది.

ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్లారు. మ్యాచ్ జ‌రుగుతున్న ప్రాంగ‌ణంలో కూర్చుని త‌న పేరు రాసి ఉన్న జెర్సీని ధ‌రించి.. భార‌త ప‌తాక‌ను రెప‌రెప‌లాడించారు. ఈ విష‌యాన్ని ఉటంకిస్తూ.. వైసీపీ మీడియా ఓ క‌థ‌నాన్ని అల్లేసింది. ప్ర‌జ‌ల సొమ్ముతో నారా లోకేష్ కొలంబో వెళ్లార‌ని పేర్కొంది. విజ‌య‌వాడ నుంచి గ‌న్న‌వ‌రం.. అక్క‌డ నుంచి ఢిల్లీ.. అటు నుంచి కొలొంబో వెళ్లార‌ని.. ఒక‌వైపు వెళ్ల‌డానికే ఖ‌ర్చు 25 ల‌క్ష‌ల నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపింది.

ఆయ‌న‌తోపాటు మ‌రో నలుగురు కూడా ఉన్నార‌ని పేర్కొంది. అయితే వారెవ‌రో పేర్కొన‌లేదు. వీరి రాను పోను ఛార్జీలు, బ‌స‌, తిండి ఖ‌ర్చు అంటూ.. ఓ రెండు నుంచి మూడు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశార ని వైసీపీ నాయ‌కులు ఆరోపించారు. కాగా.. దీనిపై తాజాగా మంత్రి లోకేష్ స్పందించారు. ``నా ద‌డ్డుతో నేను పోతిని నీకేంటి నొప్పి`` అంటూ.. సీమ యాస‌లో ఆయ‌న వైసీపీకి ఇచ్చిప‌డేశారు.

``ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్‌?`` అంటూ పుష్ప సినిమాలో బ‌న్నీ డైలాగ్‌తో జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కాగా.. గ‌తంలో 2017-19 మ‌ధ్య మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా.. లోకేష్ చిరుతిండి ఖ‌ర్చే కోట్లు అంటూ జ‌గ‌న్ మీడియా ఓ క‌థ‌నం రాసింది. దీనిపై లోకేష్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ కేసు విచార‌ణ ప్ర‌స్తుతం విశాఖ ప‌ట్నం కోర్టు ప‌రిధిలో ఉంది.

Tags
Minister lokesh counter pushpa dialogue jagan
Recent Comments
Leave a Comment

Related News