హీరోయిన్ ప్రశ్న.. ల‌వ్ మ్యాట‌ర్ లీక్ చేసేసిన ప్ర‌భాస్‌..!

admin
Published by Admin — February 20, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా, ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా డార్లింగ్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. గతంలో అనుష్క నుంచి కృతి సనన్ వరకు ఎంతో మంది హీరోయిన్లతో ఆయ‌న‌కు లింకులు పెట్టినా.. ప్రభాస్ మాత్రం ఎప్పుడూ ఒక చిన్న నవ్వుతో ఆ టాపిక్‌ను స్కిప్ చేసేవారు. కానీ, ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ప్రభాస్ తన ల‌వ్ మ్యాట‌ర్‌ను లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ టీమ్‌తో ప్రభాస్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ క్రమంలో హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్‌ను ఒక ప్రశ్న అడిగేసింది. ``సర్.. మీకు అసలు లవ్ అంటే ఏంటి?`` అని ఆమె అడగ్గానే ప్రభాస్ ఒక్క క్షణం సిగ్గుపడ్డారు. ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలకు తప్పించుకునే ప్రభాస్, ఈసారి మాత్రం చాలా ఓపెన్‌గా సమాధానం ఇచ్చారు.

ఆమె అడిగిన ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ.. ``ఇది నీ పర్సనల్ క్వశ్చన్ కదా`` అని చమత్కరిస్తూనే తన మనసులో మాట బ‌య‌ట‌పెట్టారు. ``నిజం చెప్పాలంటే.. ఇప్పుడు లవ్ అని అడగ్గానే నాకు మీ సినిమానే (కపుల్ ఫ్రెండ్లీ) గుర్తొస్తోంది. ఆ సినిమా చూడగానే నాకూ ప్రేమలో పడాలని అనిపించింది. గతంలో గీతాంజలి, ఏ మాయ చేశావే సినిమాలు చూసినప్పుడు క‌లిగిన ఆ ఫీలింగ్.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా చూశాకే కలిగింది`` అంటూ మనసు విప్పి మాట్లాడారు. 

ప్రభాస్ లాంటి మాస్ యాక్షన్ హీరో, ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూసి ఇన్స్పైర్ అవ్వడం, తనకు కూడా ప్రేమలో పడాలని ఉందని చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ``డార్లింగ్.. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా ఆ శుభవార్త చెప్పేయండి`` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags
Couple Friendly Prabhas Santosh Soban Manasa Varanasi Tollywood Rebel Star Prabhas
Recent Comments
Leave a Comment

Related News