తమిళ సంగీత మాంత్రికుడు, ఇసై జ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా ఈ మధ్య కాలంలో అద్భుతమైన పాటలతో కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డోరోతి చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. అదే ఊపులో మరాఠీ చిత్రం గోంధల్ కు ఇళయరాజా సంగీతంతో పాటు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా 99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్ 2027) రేసులో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీ గా ఆ చిత్రం నిలిచింది.
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం పోటీ పడనుంది. అయితే, ఈ చిత్రం కేవలం అర్హతను సాధించిందని, తుది నామినేషన్, షార్ట్ లిస్ట్ ఇంకా కాలేదని అకాడమీ వర్గాలు వెల్లడించాయి
సంతోష్ దవఖర్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహారాష్ట్ర రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుంది. రాత్రిపూట మరాఠా సంప్రదాయం అయిన గోంధల్ క్రతువు నేపథ్యంలో ఒక రాత్రిలో జరిగే కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు.