బండ్లన్నకు బిగ్ రిలీఫ్

admin
Published by Admin — November 24, 2026 in Movies
News Image

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. అయితే, బండ్ల గణేష్ ఇటీవల  95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారు. దీంతో, ఆయనకు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వివాదం ముగిసిపోయిందని గణేష్ పై ఫిర్యాదు చేసిన జెట్టి వెంకటేశ్వరరావు వెల్లడించారు .ఈ ప్రకారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో, ఈ చెక్ బౌన్స్ కేసు గొడవ సద్దుమణిగింది.

తమ మధ్య చిన్నపాటి వివాదం ఏర్పడిందని, దానిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని వెంకటేశ్వరరావు అన్నారు. తన కొడుకు బండ్ల గణేష్ ఎంతో స్నేహంగా ఉండే వారని గుర్తు చేసుకున్నారు. అయితే, తన కొడుకు చనిపోయిన తర్వాత మధ్యవర్తుల ప్రమేయం వల్ల, వేరే ఏ కారణం వల్లనో తమ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చి కోర్టు కేసుల వరకు వెళ్ళామని చెప్పుకొచ్చారు. ఇకపై బండ్ల గణేష్ తో తన స్నేహం అనుబంధం గతంలో మాదిరిగానే కొనసాగుతాయని అన్నారు.

Tags
bandla ganesh check bounce case
Recent Comments
Leave a Comment

Related News