నేను పార్టీలో వ‌చ్చేస‌రికి కాంగ్రెస్ ప‌రిస్థితి బాలేదు: రేవంత్ రెడ్డి

admin
Published by Admin — February 22, 2026 in Telangana
News Image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను పార్టీలోకి వ‌చ్చే స‌రికి.. పార్టీ ప‌రిస్థితి ఏమంత బాగా లేద‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు.. ఆ స‌మ‌యంలో త‌న‌ను చాలా మంది వ్య‌తిరేకించార‌ని కూడా రేవంత్ రెడ్డిచెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఓర్పు-నేర్పుతోనే అంద‌రినీ క‌లు పుకొని పోయాన‌న్నారు. అదే పార్టీకి మేలు చేసింద‌ని చెప్పారు. ఐక్య‌త‌, కార్యాచ‌ర‌ణ కార‌ణంగానే పార్టీ అయినా.. నాయ‌కులు అయినా బ‌ల‌ప‌డ‌తార‌ని చెప్పారు.

ఏపీ, తెలంగాణ పార్టీ పార్టీ జిల్లాల అధ్య‌క్షుల‌కు తెలంగాణ‌లోని వికారాబాద్‌లో రెండు రోజుల శిక్ష‌ణ కార్య క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా నేత‌ల‌కు.. పార్టీపై దిశానిర్దేశం చేశారు. డీసీసీ అనేది చిన్న ప‌ద‌వి కాద‌ని.. దీనిని వాడుకుని ముఖ్య‌మంత్రి స్తాయికి చేరుకునే అవ‌కాశం ఉంద‌న్నా రు. అదేవిధంగా డీసీసీగా చేసిన వారు చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల వ‌రుకు ఎదిగార‌ని చెప్పారు. నాయకులు ప‌నిచేసే విధానంపైనే వారి అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.

జీవ‌న్ రెడ్డి, జ‌గ్గారెడ్డిల‌ను ఉద్దేశించి..

స్వేచ్ఛ, అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్ర‌మేన‌ని రేవంత్ చెప్పారు. ఎవ‌రి అభిప్రాయాలు ఏవైనా.. అవ‌న్నీ.. దండ‌లో దారంమాదిరిగా ఉండాల‌ని.. భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని తీసుకు వ‌చ్చేలా ఉండాల‌ని సూచించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన అలాంటి వారిని వేధింపుల‌కు గురి చేయ‌డం, ప‌ద‌వులు రాకుండా అడ్డుకోవ‌డం అనేది ఉండ‌ద‌ని ప‌రోక్షంగా ఆయ‌న జీవ‌న్ రెడ్డి, జ‌గ్గారెడ్డిల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పార్టీలో ఉన్న నాయ‌కులు ఎవ‌రికి వారు కీచులాడుకుంటే.. కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గ‌త నేతలు దేశం కోసం అనేక త్యాగాలు చేశార‌ని.. వారి త్యాగాల‌ను మ‌నం కొన‌సాగించాల‌ని సూచించారు. అందరం కృషి చేయడంతోనే గ‌త ఎన్నిక‌ల్లో అధికారం ల‌భించింద‌ని.. ఇదే స్ఫూర్తిని నాయ‌కులు కార్య‌క‌ర్త‌లుకూడా కొన‌సాగించాల‌ని సూచించారు.  

Tags
Congress revanth reddy comments internal clashes
Recent Comments
Leave a Comment

Related News