``మీరు రాజకీయం కోసం ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం చేసిన తప్పేముం ది ? `` అంటూ.. బీజేపీ సీనియర్ నాయకుడు.. సుబ్రమణ్య స్వామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇలాంటి పిటిషన్లతో అత్యున్నత కోర్టు సమయాన్ని వృ థా చేయాలని భావిస్తున్నట్టుగా ఉందని.. వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లపై విచారణ చేపట్టి సమ యం వృథా చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారానికి సంబంధించి.. మరింత లోతుగా విచారణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిం ది. మాజీ ఏఐఎస్ అధికారి నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేయనుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా కమిషన్‌కు ప్రభుత్వం నిర్దేశించింది. టీటీడీ వ్యవస్థలో మరింత పారదర్శత తీసుకురావడంతోపా టు.. లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన మార్గదర్శకాలు చేయాలని కోరింది.
అయితే.. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ.. సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్ప టికే సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ నేతృత్వంలోని కమిటీ సమగ్రంగా విచారణ చేసిందని తెలిపారు. కానీ, ఏపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే తాజాగా ఏకసభ్యకమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చిందని.. దీనిని రద్దు చేయాలని సీబీఐ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టును కోరారు.
ఈ పిటషన్‌పై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. ప్రాథమిక దశలోనే దీనిని తోసిపుచ్చుతున్నట్టు తెలి పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్(కమిటీపై కమిటీ) కిందకు రాదని.. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేప థ్యంలో సుబ్రమణ్యస్వామి పిటిషన్ రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో సదరు పిటిషన్‌ను తోసిపుచ్చింది.