నానికి ఆ దర్శకుడి వెరైటీ విషెస్

admin
Published by Admin — February 25, 2026 in Movies
News Image

‘‘నిన్ను నేను ప్రతిసారీ ధ్వంసం చేస్తున్నా’’.. ‘‘నువ్వు పెట్టుకున్న ప్రతి సినిమా రూల్‌ను నేను బ్రేక్ చేశా’’ ఇలాంటి నెగెటివ్ కామెంట్స్‌తో ఒక హీరోకు ఒక దర్శకుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? ‘దసరా’తో అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ (the paradise)తో మరోసారి సంచలనం రేపడానికి సిద్ధమవుతున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela).. తన రెండు చిత్రాల కథానాయకుడు నాని(hero nani)కి తనదైన శైలిలో బర్త్ ‌డే విషెస్ చెప్పాడు. 

నాని మీద తన ప్రేమను.. అలాగే తన మీద నానికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ నేచురల్ స్టార్‌కు శ్రీకాంత్ తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లోపెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మంగళవారం నాని 42వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీకాంత్ పెట్టిన పోస్టు సారాంశం ఏంటో చూద్దాం పదండి.

‘‘నాని అన్నా.. నువ్వు ‘‘నీ ఇష్టం శ్రీకాంత్’’ అని అన్న ప్రతిసారీ నాకు ‘‘నిన్ను నమ్ముతా శ్రీకాంత్’’ అని వినిపిస్తుంది. ఆ నమ్మకం నన్ను భయపెడుతుంది. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రతి క్షణం నా రక్తాన్ని, జీవితాన్ని ధారబోసేలా చేస్తుంది. నేను నీ ప్రతి సినిమా రూల్‌ను, నీ వర్కింగ్ డేస్ శైలిని, నీ విడుదల తేదీ క్రమాన్ని, నీ పనితీరును, నీకు నువ్వ పెట్టుకున్న సినిమా మేకింగ్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశా. నేను నిన్ను ధ్వంసం చేసిన ప్రతిసారీ నువ్వు నన్ను నిర్మించావు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆ దిశగా నన్ను నిర్మించింది నువ్వే.

నువ్వు నమ్మినంత నన్ను ఎవ్వరూ నమ్మలేదు అన్నా. నిన్ను జడలు వేసుకోమంటే ‘‘ఓకేరా నీ ఇష్టం’’ అన్నావు. నీ చేతి మీద ఒక బూతు మాటతో టాటూ వేసుకోమంటే.. ‘‘ఓకేరా నీ ఇష్టం’’ అన్నావు. లెక్కలేనన్ని రీటేక్స్‌తో నిన్ను హింస పెట్టినా అప్పుడు కూడా ‘‘ఓకే రా నీ ఇష్టం’’ అనే అన్నావు. నీకు నేను ఏదీ నేరుగా చెప్పలేదు. కానీ సినిమాకు మాత్రం చెప్పాలి. ‘‘నీ ఇష్టం శ్రీకాంత్’’ అని నువ్వు అనే మాటకు జవాబు వెతకడానికే నా జీవితంలో ప్రతి క్షణాన్ని వెచ్చిస్తాను. ‘ది ప్యారడైజ్’తో నాకు తెలియకుండానే ఈ జవాబు రాబడతానని అనుకుంటున్నా. నన్ను నమ్మిన నా ధరణికి, నన్ను మళ్లీ నమ్మిన నా జడల్‌కి.. పుట్టిన రోజు శుభకాంక్షలు నాని అన్నా. జీవితాంతం రుణపడి ఉంటా’’ అంటూ ‘ది ప్యారడైజ్’ ఆన్ లొకేషన్లో నానితో కలిస్తున్న ఒక అందమైన ఫొటోను శ్రీకాంత్ షేర్ చేశాడు. 

Tags
Hero nani director Srikanth odela Birthday wishes
Recent Comments
Leave a Comment

Related News