భార‌తి సిమెంటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

admin
Published by Admin — February 25, 2026 in Andhra
News Image

వైసీపీ(ycp) పాల‌నా కాలంలో.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు చెందిన సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు.. అనేక స‌రుకులు అందాయ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు భార‌తి సిమెంటు(Bharathi cement) సంస్థ నుంచి ల‌క్ష‌ల బ‌స్తాల సిమెంటును వినియోగించార‌ని తెలిపారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ధ‌ర‌ల‌ను మ‌రింత పెంచి ప్ర‌భుత్వ సొమ్మును త‌మ కంపెనీల‌కు రాచ‌మార్గంలో త‌ర‌లించుకుని పోయార‌ని ఆరోపిం చారు. అదేవిధంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారానికి సొంత మీడియాను వాడుకున్నార‌ని పేర్కొన్నారు.

దీనికి కూడా కొటేష‌న్లు పెంచి.. ప్ర‌జ‌ల సొమ్మును త‌మ ఖాతాల్లో వేసుకున్నార‌ని సీఎం తెలిపారు. ఇలా.. అధికారంలో ఉన్న పార్టీ.. త‌మ సంస్థ‌ల ద్వారా ప్ర‌జ‌ల సొమ్మును దోచుకోవ‌డం తాను ఎప్పుడూ చూడ‌లే ద‌న్నారు. ముఖ్య‌మంత్రులుగా ఉన్న వారికి వ్యాపారాలుఉండ‌వ‌ని చెప్పారు. కానీ, గ‌త సీఎం జ‌గ‌న్(cm jagan) ప‌క్కా వ్యాపార వేత్తగా వ్య‌వ‌హరించార‌ని పేర్కొన్నారు. తాను ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. హెరిటేజ్‌తో సంబంధం తెంచుకున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే త‌న స‌తీమ‌ణి టేకోవ‌ర్ చేశార‌ని చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ.. హెరిటేజ్ సంస్థ‌కు చెందిన ఏ ఉత్ప‌త్తినీ ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం వినియోగించ‌లేద‌ని సీఎం తెలిపారు. పాలు, నీళ్లు, ఐస్ క్రీం, స్వీట్లు స‌హా.. ఏదీ ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల్లో హెరిటేజ్ నుంచి తీసు కురాలేద‌న్నారు. కొంద‌రు త‌న‌ను ఈ విష‌యంలో ఒత్తిడి చేసినా.. హెరిటేజ్ సంస్థ నుంచి ఒక్క ఆహార ప‌దార్థాన్నీ తీసుకోలేద‌న్నారు. కానీ, తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై యాగీ చేస్తున్న వైసీపీ నాయ‌కులు హెరిటేజ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

హెరిటేజ్ త‌ప్పు చేయ‌దు!

హెరిటేజ్(heritage) సంస్థ త‌ప్పు చేయ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. హెరిటేజ్‌ సంస్థ మా కుటుంబ వ్యాపార సంస్థ అయినా.. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా ఆ సంస్థ ఉత్పత్తులు సరఫరా కాలేదన్నారు. ప్రభుత్వ నుంచి ఎలాంటి సహకారం లేకుండానే హెరిటేజ్ నిజాయతీగా వ్యాపారం చేస్తోంద‌ని తెలిపారు.

Tags
Bharathi cement ycp jagan cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News

Latest News