జగన్ ను వైఎస్ తో పోల్చొద్దన్న షర్మిల

admin
Published by Admin — February 27, 2026 in Andhra
News Image
వైసీపీ(ycp)లో వైఎస్సార్ లేనేలేర‌ని.. ఆ పార్టీ గురించి ఎవ‌రైనా మాట్లాడేప్పుడు.. వైఎస్ పేరును వాడుకోవ‌ద్ద‌ని కాంగ్రెస్(congress) పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల‌(ys sharmila) సూచించారు. వైసీపీ పాల‌న ఒక దురదృష్ట‌క‌ర కాల‌మ‌ని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌తో వైసీపీ పాల‌న‌ను పోల్చ‌రాద‌ని ఆమె కోరారు. ``నేను చెప్పేది ఒక్క‌టే. ఎవ‌రైనా ఏమైనా మాట్లాడండి. కానీ, వైసీపీ పాల‌న‌ను వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిగారితో పోల్చి మాత్రం మాట్లాడొద్దు. ఆయ‌న పాల‌న సువ‌ర్ణాధ్యాయం. వైసీపీ పాల‌న దుర‌దృష్ట‌క‌రం`` అని అన్నారు.
 
కార‌ణం ఏంటి?
 
ఏపీ అసెంబ్లీ(ap assembly)లో వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌పై మంగ‌ళ‌వారం సుదీర్ఘంగా చ‌ర్చజ‌రిగింది. ఈ స‌మ‌యంలో టీటీడీ(ttd) ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు(cm chandrababu) ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ స‌మ యంలో గ‌త కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి కూడా చ‌ర్చ జ‌రిగింది. తిరుమ‌ల కొండ‌ను రెండు కొండ‌ల‌కు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. దీనిపై అప్ప‌ట్లోనే తాము నిర‌స‌న వ్య‌క్తం చేశామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అదేవిధంగా అన్య‌మ‌త ప్ర‌చారం కూడా పెరిగింద‌న్నారు.
 
వైసీపీ పాల‌న‌లో అంత‌కుమించి దేవ‌దేవుడి ప్ర‌సాదాన్ని కూడా క‌ల్తీ చేశార‌ని.. లంచాలు తీసుకుని నెయ్యి(ghee) ని అనుమ‌తించార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా అన్న ప్ర‌సాదాల‌ను కూడా నాసిర‌కంగా పెట్టార‌ని భ‌క్తులే చెప్పార‌ని.. దీనిపై వేలాది మంది స్పందించార‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపైనే ష‌ర్మిల స్పందించారు. వైసీపీ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ‌ని అన‌డంలో తాము కూడా ఏకీభ‌విస్తామ‌న్నారు. వైసీపీ పాల‌న తాలూకు న‌ష్టాలను ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ భ‌రిస్తున్నార‌ని తెలిపారు.
 
కానీ.. వైసీపీ పాల‌న‌ను, వైఎస్ పాల‌న‌ను వేర్వేరుగా చూడాల‌ని ష‌ర్మిల తెలిపారు. వైఎస్ఆర్(ysr) ను విమ‌ర్శించేం దుకు అవ‌కాశం లేద‌ని.. ఆయ‌న హ‌యాంలోనే తిరుమ‌ల బాగుంద‌న్నారు. రెండు కాదు.. ఏడు కొండ‌లు.. శ్రీవారి ఆస్తిగా ప‌రిగ‌ణిస్తూ.. జీవో ఇచ్చార‌ని తెలిపారు. అలాగే.. అన్య‌మత ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు కూడా రెండు జీవోలు తెచ్చార‌ని.. చెప్పారు. వైసీపీ పాల‌న‌లో తిరుమ‌ల ప‌విత్ర‌త పోయింద‌న్న‌ది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.
Tags
jagan congress ys sharmila ysr no comparison
Recent Comments
Leave a Comment

Related News

Latest News